Rains in Telugu States: వేడితో అల్లాడుతున్న ప్రజలకు చల్లని వార్త.. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, ఏపీలో కూడా..
Representational Image (Photo Credits: Twitter)

Hyderabad, Sep 3: వర్షాకాలమైనా వానలు (Rains) పడక, ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలకు వాతావరణశాఖ చల్లని వార్త చెప్పింది. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ ను (Yellow, Orange Alert) హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు ఏపీలోనూ వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

India vs Pakistan: భారత్- పాక్‌ మ్యాచ్‌ వర్షార్పణం, చెరో పాయింట్ పంచుకున్న ఇరు జట్లు, ఒక్కబాల్‌ కూడా ఆడకుండానే ఆగిపోయిన మ్యాచ్‌

Asia Cup 2023 IND vs PAK Live: నిలదొక్కుకున్న ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, 25 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసిన టీమిండియా, చెలరేగుతున్న పాక్ పేసర్లు..

ఆదివారం ఉదయం వరకు ఈ జిల్లాల్లో..

శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భువనగిరి, మహబూబ్‌నగర్‌, హనుమకొండ, భద్రాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.

సోమవారం వరకు ఈ జిల్లాల్లో..

ఆదివారం నుంచి సోమవారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అతి భారీ వర్ష సూచన

సోమవారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.