New Delhi December 08: కరోనా(Corona) మహమ్మారి కారణంగా ఈ ఏడాదిలో పలు దేశాల్లో లాక్‌డౌన్(Lockdown) విధించారు. దీంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. దాంతో టైంపాస్ కోసం గూగుల్(Google) ను అనేక ప్రశ్నలు అడిగారు. చాలా అంశాల గురించి సెర్చ్(Search) చేశారు. మరి ఈ ఏడాది ఎక్కువ మంది దేని గురించి గూగుల్ లో శోధించారో తెలుసా? ఎలా కోలుకోవాలి?(How to Heal) అనే కీ వర్డ్ ను ఎక్కువగా ఉపయోగించారు. కోవిడ్(Covid-19) బారిన పడ్డవారు ఎలా కోలుకోవాలో సెర్చ్ చేయడంతో పాటూ, ముందుజాగ్రత్తగా కూడా ప్రజలు కోవిడ్ పై గూగుల్(Google) లో సెర్చ్ చేశారు. ఈ విషయాన్ని గూగుల్ సెర్చింజన్(Google Search Engine) తెలిపింది. తమ #YearInSearchలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ ఏడాదిలో చాలా మంది ‘హౌ టు హీల్’ (ఎలా కోలుకోవాలి?) అంశంపై ఇదివరకెన్నడూ లేనంతగా సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ‘ఇంకో లాక్‌డౌన్ ఉంటుందా?(LOCK DOWN)’, ‘ధైర్యంగా ఎలా ఉండాలి?’, ‘నాకు వ్యాక్సిన్ ఎప్పుడు దొరుకుతుంది?(VACCINATION) వంటి అంశాలను కూడా బాగానే వెతికారట. అయితే ఈ సెర్చ్‌లో టాప్‌లో నిలిచిన అంశం ‘ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా(Australia Vs India)’.
అలాగే ఇండియా వర్సెస్ ఇంగ్లండ్, ఐపీఎల్, ఎన్‌బీఏ, యూరో2021 కూడా బాగా సెర్చ్ చేశారు. ఇవి సెర్చింగ్‌లో టాప్-5లో ఉన్నాయి. ఇక భారత్ లో మాత్రం ఐపీఎల్ కీ వర్డ్ ను ఎక్కువగా ఉపయోగించారు ప్రజలు.