Monsoon | Representational Image (Photo Credits: Pixabay)

మండే ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ వాసులకు ఐఎండీ చల్లని కబురును అందించింది. ఏపీలో రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 8న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు 13న శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలను కూడా తాకాయి. అయితే వాతావరణం అనుకూలించక ఐదారు రోజులు దోబూచులాడిన పవనాల్లో ఆదివారం కదలిక వచ్చింది.

ఈ నెల 11 నుంచి కర్ణాటక-ఏపీ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది. మంగళవారం ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దీని ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షం పడింది. ఇవాళ సాయంత్రం విజయవాడలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

గత రెండు వారాలుగా నగరంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఎండ తీవ్రతకి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇవాళ వర్షం కురవడంతో విజయవాడ ప్రజలు సేదతీరారు.

కేరళను వణికిస్తున్న విష జ్వరాలు, రెండు వారాల్లోనే 23 మంది మృతి, ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా జ్వరాల కేసులు నమోదు

సోమవారం ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో దాదాపు విస్తరించినట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కె.అశోక్‌కుమార్‌ తెలిపారు. సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినందున రాగల రెండు రోజులూ జిల్లాకు వర్షసూచన ఉందన్నారు.ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే పరిస్థితి ఉందన్నారు.

ఓరల్ సెక్స్ వల్ల గొంతు క్యాన్సర్‌ వస్తుందా, నోటి సెక్స్ అంటే ఏమిటి, ఈ శృంగారంపై వచ్చే వ్యాధులపై నిపుణులు ఏమంటున్నారు

నైరుతి రుతుపవనాలు రాయలసీమ, దక్షిణాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలకు, నెల్లూరు జిల్లా కావలి వరకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బీఆర్‌ అంబేడ్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

రేపు పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 66.5 మి.మీ, ప్రకాశం జిల్లా కొండెపిలో 64 మి.మీ, ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులో 58.5 మి.మీ, గుంటూరు జిల్లా కొల్లిపరలో 49.5, మంగళగిరిలో 64 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

తెలంగాణలో వచ్చే 3 రోజులు వర్షాలు

ఈరోజు నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు మూడు రోజుల్లో ద్వీపకల్ప దక్షిణ భారతంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వివరించింది. తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.