Hyderabad, June 5: రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలు (Telugu States) నిప్పుల కొలిమిగా మారనున్నాయి. తెలంగాణలో మంగళవారం నుంచి అధిక ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వారం పాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు (High Temperatures) స్థిరంగా కొనసాగుతాయని పేర్కొంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటాయని తెలిపింది. అయితే, సోమవారం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.
Cricketers Photo Shoot: మన క్రికెటర్స్ ఫోటో షూట్.. జబర్దస్ట్ ఫోటోలు ఇవిగో..
ఉడికిపోతున్న దక్షిణ కోస్తా జిల్లాలు
ప్రచండ భానుడు కక్కుతున్న నిప్పులతో దక్షిణ కోస్తా జిల్లాలు ఉడికిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా 45 నుంచి 46 డిగ్రీలు నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నేడు, రేపు కూడా పరిస్థితులు ఇలానే ఉండే అవకాశం ఉందని, కాబట్టి వీలైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు, ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రం భిన్నమైన వాతావరణం నెలకొంది. పిడుగులు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో గరిష్ఠంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా సాయంత్రానికి వాతావరణం చల్లబడుతోంది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 8న రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని, అప్పటి వరకు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఇక, నిన్న అత్యధికంగా ఏలూరు జిల్లా కామవరపుకోటలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయి.