Traffic Restrictions in Hyderabad: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం.. హైదరాబాద్ లో నేడు, రేపు ట్రాఫ్రిక్ ఆంక్షలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వంతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి.
Hyderabad, June 1: తెలంగాణ రాష్ట్ర అవతరణ (Telangana Formation Day) దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వంతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ (BRS) వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం ఉత్సవాలు జరుగనుండగా, బీఆర్‌ఎస్ మూడు రోజులపాటు వేడుకలను నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్, గన్ పార్క్, పరేడ్ గ్రౌండ్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
ఆంక్షలు ఇలా..
ట్యాంక్ బండ్ పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్ పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. అదేవిధంగా ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
(The above story first appeared on LatestLY on Jun 01, 2024 09:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

