Heavy rains. (Photo Credits: PTI)

అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రేపు బంగాళాఖాతంలో ప్రవేశించి మరింత బలపడనుందని వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. నవంబరు 18న అది ఏపీ తీరాన్ని తాకనుందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, దక్షిణ చత్తీస్ గఢ్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ( Heavy Rainfall Till November 18) ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది

కేర‌ళ‌లో (Kerala Rains) శ‌నివారం రాత్రి నుంచి కుంభ‌వృష్టి కురుస్తున్న‌ది. దాంతో లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ నీట‌మునిగాయి. మ‌రిన్ని వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న‌ద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఐఎండీ కేర‌ళ‌లోని ఆరు జిల్లాల‌కు ఆరంజ్ అలర్ట్ జారీచేసింది. ఐఎండీ ఆరంజ్ అల‌ర్ట్ జారీచేసిన జిల్లాల్లో ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్‌, కోజికోడ్‌, క‌న్నూర్, కాస‌ర్‌గోడ్ జిల్లాలు ఉన్నాయి. ఈ ఆరు జిల్లాలు మిన‌హా మిగ‌తా అన్ని జిల్లాల‌కు యెల్లో అల‌ర్ట్ జారీచేసింది.

దూసుకొస్తున్న తుఫాను, విద్యుత్ సమస్య ఉంటే వెంటనే 1912కు ఫోన్ చేయండి, విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన APSPDCL MD హెచ్. హరనాథ రావు

కేరళలో భారీవర్షాల వల్ల ఇద్దరు పిల్లలు మరణించారు. తన ఇంటికి సమీపంలో సంభవించిన వరదల్లో మునిగి మూడేళ్ల బాలుడు మరణించాడు.తల్లితో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చిన చిన్నారి కాలు జారి వాగులో పడి మరణించింది. మరో ఘటనలో కన్నూర్ జిల్లాకు చెందిన ఓ చిన్నారి వర్షపు నీటితో పొంగిపొర్లుతున్న బావిలో పడి ప్రాణాలు కోల్పోయింది.కేరళలోని అప్పర్ కుట్టనాడ్‌లోని పలు ప్రాంతాలు భారీగా జలమయమయ్యాయి.

కేరళలో వారాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం విజయన్ ప్రజలను కోరారు.కొండచరియలు విరిగిపడే అవకాశం ,వరదలు సంభవించే అవకాశం ఉన్న పలు జిల్లాలకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.భారీ వర్షాల కారణంగా దక్షిణ కేరళలోని పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.కేరళ రాష్ట్రంలోని వివిధ డ్యామ్‌లలో నీటిమట్టం కూడా రెడ్ అలర్ట్ మార్క్‌కు పెరగడంతో ఇడుక్కి రిజర్వాయర్‌కు చెందిన చెరుతోని డ్యామ్‌లోని ఒక షట్టర్‌ను ప్రభుత్వం ఆదివారం తెరిచింది.

తుఫాను ముప్పు, నీట మునిగిన నెల్లూరు, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అదేశాలు, 13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తీరం దాటనున్న తుఫాను

ఇక ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఏపీకి 1,200 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.. దీని ప్రభావం ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 16న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 17 నుంచి తీరం దాటే వరకూ ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ వాయుగుండం తీరం దాటగానే..ముంచుకొస్తున్న ఇంకో వాయుగుండం ముప్పు, తమిళనాడు, ఏపీలో కుండపోత వర్షాలు

ఉపరితల ఆవర్తనం ఉత్తర అంతర్గత తమిళనాడు దాని పరిసర ప్రాంతాల మీద నుండి ప్రస్తుతం అంతర్గత కర్ణాటక, ఉత్తర అంతర్గత తమిళనాడు ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.6 కి.మీ ఎత్తులో వరకు వ్యాపించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఒక ద్రోణి ఉత్తర అంతర్గత తమిళనాడు మీద ఉన్న ఉపరితల ఆవర్తనము నుండి గంగా పరివాహక ప్రాంత పశ్చిమ బెంగాల్ వరకు ఆంధ్ర, ఒడిశా మీదుగా సముద్ర మట్టమునకు 0.9 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉండి బలహీనపడినదని తెలిపారు. వీటన్నింటి ప్రభావం వల్ల రాగల మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.