కరోనా సమయంలో భారతదేశానికి చెందిన మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ విప్రో ఉద్యోగ అవకాశాలను (Wipro Elite 2021) కల్పించేందుకు రెడీ అయింది. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు, అలాగే 2021లో ఇంజనీరింగ్ పూర్తి చేయనున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ 2021 ని (WIPRO ELITE NATIONAL TALENT HUNT 2021) ప్రకటించింది. దేశవ్యాప్తంగా మంచి టాలెంట్ ఉన్న ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్‌కు ఉద్యోగాలు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇవ్వబోతోంది.
కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి స్ట్రీమ్స్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా తెలిపింది. ఆన్‌లైన్ పరీక్ష, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. వార్షిక వేతనం రూ.3.50 లక్షలుగా ఉంటుందని విప్రో తెలిపింది. ఈ మేరకు విప్రో ట్విటర్ ద్వారా వివరాలను షేర్ చేసింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలు manager.campus@wipro.com లో లభ్యమవుతాయి. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే manager.campus@wipro.com మెయిల్ ఐడీకి Elite NTH 2021 సబ్జెక్ట్‌తో మెయిల్ పంపాలి. మూడు వర్కింగ్ డేస్‌లో సమాధానాలు వస్తాయి.
Here's Wipro Elite National Talent Hunt 2021:
.@Wipro's Elite National Talent Hunt 2021 #NTH is a #FresherHiring program to attract the best #engineering talent in India. If you are a student graduating in 2021, this is an opportunity for you to kickstart your #career: https://t.co/Gw1oljWlaS#IndiaJobs #WiproJobs pic.twitter.com/RlCtOxmtth
— Wipro Limited (@Wipro) December 10, 2020
భర్తీ చేసే పోస్టులు- ప్రాజెక్ట్ ఇంజనీర్
విద్యార్హతలు- 10వ తరగతిలో 60 శాతం కన్నా ఎక్కువ, 12వ తరగతిలో 60 శాతం కన్నా ఎక్కువ మార్కులతో పాస్ కావాలి. గ్రాడ్యుయేషన్ 65 శాతం మార్కులతో పాస్ కావాలి. 2021 సంవత్సరంలో బీఈ, బీటెక్, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పాసయ్యేవారికే అవకాశం.
బ్రాంచ్‌లు- కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సర్క్యుటల్
వేతనం- వార్షికంగా రూ.3,50,000గా నిర్ణయించింది.
కండీషన్లు
10వ తరగతి, గ్రాడ్యుయేషన్ మధ్య మూడేళ్లు గ్యాప్ ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచే ఫుల్ టైమ్ డిగ్రీ కోర్సు చేయాలి. 10వ తరగతి, 12వ తరగతి పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ కోర్స్ చేసినవారికి అవకాశం లేదు. సెలక్షన్ నాటికి అన్ని బ్లాక్ లాగ్స్ క్లియర్ చేయాలి. గత ఆరు నెలల్లో విప్రో నిర్వహించిన సెలక్షన్ ప్రాసెస్‌లో పాల్గొన్న అభ్యర్థులకు అవకాశం లేదు.