Ranchi, July 02: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) నాటు వైద్యం (Ayurvedic) చేయించుకున్నాడంటూ ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. జార్ఖండ్ రాజధాని నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని మారుమూల గ్రామానికి వెళ్లి ధోనీ (Dhoni)చికిత్స తీసుకుంటున్నాడట.. అందుకు ధోనీ కేవలం రూ.40 చెల్లిస్తున్నాడట. ధోనీ నాటు వైద్యం చేయించుకోవడం ఏంటి అతడికి ఏమైందని అభిమానులు ఆరా తీస్తున్నారు. ధోనీ గతకొంతకాలంగా మోకాళ్ల నొప్పులతో (Knee pains)బాధపడుతున్నాడట. నాటు వైద్యుడి గురించి అతడి దగ్గర చికిత్స తీసుకుంటున్నాడట. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న ధోనీ.. ఆయుర్వేద వైద్యుని దగ్గర చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
దాంతో రాంచీకి (ranchi) సుమారు 70కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామం లాపంగ్లోని ఆయుర్వేద వైద్యుడు భందన్ సింగ్ ఖర్వార్ (Vandan Singh Khervar) గురించి తెలుసుకున్నాడు. వెంటనే మహీ ఆయన దగ్గరకు వెళ్లాలని నిర్ణయించకున్నారు. ఇందులో భాగంగానే కొన్ని రోజులుగా దశల వారిగా భందన్ సింగ్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నాడట. చికిత్స కోసం కేవలం రూ. 40 మాత్రమే చెల్లిస్తున్నాడు.
గతంలో ధోని తల్లిదండ్రులకు మోకాళ్ల నొప్పులు వచ్చిన సమయంలో ఈ నాటు వైద్యుడి దగ్గరే చికిత్స తీసుకున్నారు. వారికి నయం కావడంతో ధోని కూడా అతని దగ్గరే నాటు వైద్యం చేయించుకుంటున్నట్లు తెలిసింది. ఆయుర్వేద మందు కోసం వెళ్లిన ప్రతిసారి అక్కడి వారితో ధోనీ ఫొటోలు దిగుతున్నాడు. ఇప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.