New Delhi, Sep 17: అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేసే(Bulldozer Justice) ప్రక్రియకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. అక్టోబర్ ఒకటో తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించింది. బుల్డోజర్ వినియోగంపై మళ్లీ వాదనలు చేపట్టే వరకు ఆ చర్యలను ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది.
అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని తప్పుపడుతూ ఇటీవల సుప్రీంకోర్టు పలుమార్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని గొప్పగా చిత్రీకరించడాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఎన్నికల సంఘానికి కూడా వార్నింగ్ ఇచ్చింది. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, చెరువుల్లో జరిగిన ఆక్రమణల విషయంలో తమ తీర్పు వర్తించదని కోర్టు చెప్పింది.