Narendra Modi (Photo Credits: ANI)

New Delhi, April 1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్యచేస్తామని బెదిరిస్తూ ( Conspiracy to assassinate PM Narendra Modi ) జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు ఒక అగంతకుడి నుంచి మెయిల్ వచ్చింది. ఈ బెదిరింపు మెయిల్‌ ఒకటి ముంబైలోని ఎన్‌ఐఏ(నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) కార్యాలయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ప్రధాని మోదీ హత్యకు 20 మంది స్లీపర్‌ సెల్స్‌ను తయారు చేశామని, 20 కేజీల ఆర్‌డీఎక్స్‌ను (20 kg RDX, 20 sleeper cells) సిద్ధం చేశామని ఆగంతకులు ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ మెయిల్‌ను ధృవీకరించిన ముంబై ఎన్‌ఐఏ కార్యాలయం.. ప్రధాని భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు సమాచారం. ఈ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై NIAసంస్థ దర్యాప్తు చేస్తోంది.

వేలాది మందిని హత్య చేసేందుకు తన వద్ద 20 కిలోల ఆర్‌డీఎక్స్ కూడా ఉన్నట్టు అగంతకుడు ఆ మెయిల్‌లో పేర్కొన్నాడు. ఈ పని నిర్వహించేందుకు, దేశంలో అత్యంత విషాద ఘటనను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులతో తాను టచ్‌లో ఉన్నానని, దేశవ్యాప్తంగా ఉన్న స్లీపర్ సెల్స్‌ను తాను ఫిబ్రవరి 28న యాక్టివేట్ చేసినట్టు అజ్ఞాత వ్యక్తి తెలిపాడు.

ఈశాన్య రాష్ట్రాలలో ఏఎఫ్ఎస్‌పీఏ పరిధిని తగ్గిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం, చట్టం పరిధిలోని ప్రాంతాలను కుదిస్తున్నామని తెలిపిన అమిత్ షా

అయితే ప్రధానమంత్రి మోదీని చంపుతామని బెదిరిస్తూ ఎన్ఐఏకు మెయిల్ రావడం ఇది మొదటిసారి కాదు. 2018లోనూ పుణె పోలీసులకు వచ్చిన ఒక లేఖలో రాజీవ్ గాంధీని హత్య చేసిన తరహాలోనే మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నామనే సమాచారం ఉంది. 1991 మే 21 శ్రీపెరంబుదూరులో శ్రీలంకకు చెందిన ఆత్మహుతి బాంబర్ జరిపిన దాడిలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు.