ఈశాన్య రాష్ట్రాలలో అమల్లో ఉన్న  ఏఎఫ్ఎస్‌పీఏ (సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు చట్టం) పరిధిని కుదిస్తూ (AFSPA Relaxations) నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఎఫ్ఎస్‌పీఏ చట్టం పరిధిలోని ప్రాంతాలను కుదిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గురువారం  ప్రకటించారు. కాగా ఈ చట్టాన్నిఈశాన్య రాష్ట్రాలలో తిరుగుబాటు దారుల అణిచివేత కోసం తీసుకొచ్చారు. అయితే భద్రతా దళాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చట్టం పరిధిలోని ప్రాంతాలను కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏఎఫ్ఎస్ పీఏ కింద నాగాలాండ్, అసోం, మణిపూర్‌లకు పరిధి తగ్గింపు వర్తించనుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)