Mysuru, AUG 17: ఇది కింగ్ ఫిషర్ బ్రాండ్ ను (KingFisher)ఇష్టపడే బీరు ప్రియులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే, కింగ్ ఫిషర్ బీర్ లో నిషేధిత ఉత్ప్రేరకం (Chemical) గుర్తించారు. కానీ, మన దగ్గర కాదు. కర్నాటక రాష్ట్రం మైసూర్ జిల్లా నంజన్ గడ్ లో. అక్కడ యునైటెడ్ బ్రూవరీస్ లో 7సీ, 7ఈ బ్యాచ్ నెంబర్ తో తయారైన కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ (KF Strong), కింగ్ ఫిషర్ అల్ట్రా లాంగర్ బీర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు కెమికల్ పరీక్షల్లో తేలింది. ఈ బీర్లు తాగడం మనుషుల ప్రాణాలకే ప్రమాదం అని అధికారులు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో అక్కడ తయారైన రూ.25 కోట్ల విలువైన 78వేల 678 బీరు బాక్సులను సీజ్ చేశారు. కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మైసూరులో రూ.25 కోట్ల విలువైన బీరు బాక్సులను (Beer Seized) సీజ్ చేసింది. ఆ బీరు ‘మానవ వినియోగానికి పనికిరానిది’ అని కెమికల్ టెస్టులో తేలడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. రసాయన పరీక్ష నివేదికలో విఫలమైన స్టాక్‌ను ధ్వంసం చేయాలని అధికారులను ఆదేశించింది ఎక్సైజ్ శాఖ. Madhya Pradesh Shocker: రేప్ కేసులో శిక్ష అనుభవించినా బుద్దిరాలేదు! జైలు
నుంచి విడుదలై మైనర్‌పై అత్యాచారం చేసిన కామాంధుడు, చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై లైంగిక దాడి
జూలై 17, 2023న యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ నంజన్‌గడ్ యూనిట్‌లో తయారు చేయబడిన బ్యాచ్ నంబర్ 7C, 7E కలిగిన కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్ బీర్, కింగ్‌ఫిషర్ అల్ట్రా లాంగర్ బీర్లలో ప్రమాదకర రసాయనాలు కలిగున్నాయని జూలై 28న నంజన్‌గడ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. అందువల్ల, వాటిని కెమికల్ టెస్ట్ కోసం పంపారు. ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చే వరకు స్టాక్‌ను సీజ్ చేయాలని కోరారు.
ఆగస్టు 2న రిపోర్టు వచ్చింది. ఆ బీర్లలో నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారించారు. ఆ రెండు బ్రాండ్‌లు (బ్యాచ్ నం. 7C, 7E) మానవ వినియోగానికి పనికిరావు అని రిపోర్టులో తేలింది. నివేదికను అనుసరించి, తదుపరి చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ DCలకు ఎక్సైజ్ శాఖ లేఖలు రాసింది. ఆ స్టాక్‌లను నాశనం చేయాలని చెప్పింది. కాగా, ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
రెండు బ్యాచ్‌ల కింగ్‌ఫిషర్ బీర్‌లో సెడిమెంట్స్(ప్రమాదకర రసాయనాలు) కనిపించడంతో వాటి విక్రయాలను కర్ణాటక ఎక్సైజ్ శాఖ నిలిపివేసింది. దీనికి సంబంధించి ఆగస్టు 2నే ఉత్తర్వులు జారీ చేసినా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ బీర్‌ను తయారు చేసిన యునైటెడ్ బ్రూవరీస్‌పై ఎక్సైజ్ శాఖ కేసు నమోదు చేసింది. మైసూరు జిల్లాలోని నంజన్‌గడ్ లోని బ్రూవరీ ప్లాంట్‌లో ఈ బీరు తయారైంది. సీజ్ చేసిన బీరు మొత్తం విలువ దాదాపు రూ.25 కోట్లు ఉంటుందని అంచనా. జూలై 17న ప్లాంట్‌లో తయారు చేసిన రెండు ప్రత్యేక బ్యాచ్‌ల బీర్ల విక్రయాలను నిలిపివేయాలని రాష్ట్రంలోని అన్ని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లకు సూచించారు. ఈ మేరకు ఆగస్టు 2న బెంగళూరు అర్బన్ జిల్లాకు చెందిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ లేఖలో పేర్కొన్నారు. వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా బీర్‌ల అమ్మకాలను నిలిపివేయాలన్నారు.
కాగా.. కర్ణాటక స్టేట్ బ్రూవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ డిపోలకు, జిల్లాలోని రిటైల్ విక్రేతలకు ఆ బీరు సీసాలు సరఫరా చేయబడ్డాయి. ఈ క్రమంలో వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా ఆ బీర్ల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని అధికారులు కోరారు. బీర్ ఉత్పత్తి చేసిన సమయంలో కానీ, సరఫరా చేసిన సమయంలో కానీ అందులో ఎలాంటి ప్రమాదకర రసాయనాలు లేవు. అయితే, బ్యాచ్‌ను ఉత్పత్తి చేసిన 10 రోజుల తర్వాత ఇది కనుగొనబడింది. మొత్తం 78వేల 678 బాక్సులను ఉత్పత్తి చేయగా వాటిలో 45వేల 500 వరకు సరఫరా చేశారు. బెంగళూరులో దాదాపు 11వేల సీసాలు సప్లయ్ అయ్యాయి. కింగ్ ఫిషర్ బీర్ లో ప్రమాదాకర రసాయనాలు ఉన్నట్లు తేలడంతో బీరు ప్రియులు భయాందోళన చెందుతున్నారు.