Karnataka Home Minister Araga Jnanendra (Photo/ANI)

Mysuru (Karnataka),  Aug 28: మైసూరు సామూహిక అత్యాచార ఘటనలో (Mysuru Gangrape Case) ఐదుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఈ విషయాన్ని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ మీడియాకు వెల్లడించారు. ఈ కేసును పోలీసులు ఛేదించినట్టు హోంమంత్రి అరగా జ్ఞానేంద్ర (Karnataka Home Minister Araga Jnanendra) తెలిపారు. తాము అదుపులోకి తీసుకున్న వ్యక్తులు తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లాకు చెందిన రోజుకూలీలని సూద్ వెల్లడించారు. వారిలో ఒకరికి 18 ఏళ్లలోపు వయస్సున్నట్లు తెలుస్తోందన్నారు. అతడి వయస్సును ధ్రువీకరించుకుంటున్నామని చెప్పారు. తమిళనాడుకు చెందిన నలుగురు నిందితుల్లో ముగ్గురు నేర చరిత్ర కలిగి ఉన్నారు.

సంచలనం సృష్టించిన విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను అరెస్టు (5 Arrested in Mysuru Gangrape Case) చేయడం పోలీసుల విజయంగా కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి ఎందరిని అరెస్టు చేసారనే విషయంపై వ్యాఖ్యానించేందుకు మాత్రం నిరాకరించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతడికోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆగస్టు 24న మైసూర్ నగర శివారుల్లో ఎంబీఏ విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమె వెంటే ఉన్న స్నేహితుడిపై దుండగులు దాడిచేశారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలు షాక్‌లో ఉండటంతో, ఆమె నుంచి పోలీసులు వివరాలు సేకరించలేకపోతున్నారని హోంమంత్రి వెల్లడించారు.

ప్రేమించడంలేదని ప్రియురాలిని చంపేశాడు, ఆ తర్వాత విషం తాగి చనిపోయాడు, కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో విషాద ఘటన

అత్యాచారానికి పాల్పడిన కేసులో దుండగులు గ్యాంగ్‌ రేప్‌ దృశ్యాలను తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేశామని, రూ.3 లక్షలు ఇస్తే సరి, లేదంటే ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో, ఇంటర్నెట్లో పెడతామని బాధితురాలి స్నేహితునికి ఫోన్‌చేసి హెచ్చరించారు. ప్రస్తుతం యువతీ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అఘాయిత్యం జరిపి పరారైన దుండగులు కొంతసేపటికి తనకు ఫోన్‌ చేశారని యువతి స్నేహితుడు తెలిపాడు. వీడియోల పేరుతో రూ. 3లక్షలు డిమాండ్‌ చేశారని పోలీసులకు వివరించాడు.

అత్యాచారం, బెదిరింపుల సంగతిని పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని దుండగులు బెదిరించారని తెలిపాడు. తమపైన ఎలాంటి కేసు నమోదైనా వెంటనే వీడియోలను సోషల్‌ మీడియాలో, నెట్లో వైరల్‌ చేస్తామని బెదిరించారు. కాగా, బాధితురాలు ప్రాణాలకు ప్రమాదం లేదని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు. దుండగులు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నారని, పూర్తిగా మద్యం మత్తులో ఉన్నారని యువతి స్నేహితుడు చెప్పాడు.