Shamshabad Road Accident: లాక్‌డౌన్ వేళ..శంషాబాద్ ఔటర్ రింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, అయిదు మంది మృతి, ఆరుగురి పరిస్థితి విషమం, అందరూ కర్ణాటక వాసులే
5 persons died and 6 injured after collision between lorry mini truck at Shamshabad in Telangana (Photo-ANI)

Hyderabad. Mar 28: రంగారెడ్డి జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై శుక్రవారం అర్ధరాత్రి మినీ ట్రక్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆయిదు మంది కూలీలు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మృతి చెందినవారు కర్ణాటక వాసులను తెలిసింది. ప్రమాద సమయంలో టెంపోలో 20 మంది వలస కార్మికులు ఉన్నారు. వీరంతా రోడ్డు కాంట్రాక్ట్‌ పనులు చేసేవారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉండడంతో ఎక్కడా పని దొరకకపోవడంతో వీరంతా తమ స్వస్థలమైన కర్ణాటకలోని రాయదుర్గంకు పయనమయ్యారు.

అయితే శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొంది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వీరందరిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Here's ANI Tweet

కాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా ఓటర్‌ మార్గాన్ని మూసి ఉంచిన నేపథ్యంలో వీరి వాహనానికి అనుమతి ఎలా లభించిదన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.