Assam Rape Case: బాలిక శవాన్ని వెలికి తీసి అత్యాచారయత్నం, అస్సాంలో దారుణమైన ఘటన, నిందితునిపై ఫోక్సో చట్టంతో పాటు ఐపీసీ 306,377 సెక్షన్ల కింద కేసులు నమోదు
shamshabad Murder Case Cops change victim's name to 'Disha and telangana-cm-kcr-responds-on-justice-for-disha (photo-PTI)

Guwahati,May 21: అస్సాంలో మానవ సమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన (Assam Rape Case) జరిగింది. చనిపోయిన 14 ఏళ్ల బాలిక శవాన్ని వెలికి తీసి అత్యాచార యత్నానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దేమాజీ ఎస్పీ ధనంజయ్‌ గానావత్‌ (Dhananjay Ghanawat) తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం దేమాజి జిల్లా (Dhemaji district)కు చెందిన 14 ఏళ్ల బాలిక మే17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.తల్లిదండ్రులు అదే రోజు రాత్రి ఊరికి దగ్గరలోని సైమన్‌ నదీ తీరంలో బాలికను పూడ్చిపెట్టారు. ఏటీఎం వద్ద మనుషులపై కోడి దాడి, దర్యాప్తు చర్యలు చేపట్టిన వాల్కర్‌ పోలీసులు, అమెరికాలోని లూసియానాలో ఘటన

అయితే మరునాడు 51 ఏళ్ల అకాన్ సైకియా అనే వ్యక్తి బాలికను ఖననం చేసిన ప్రదేశానికి వెళ్లి శవాన్ని బయటికి తీసి అత్యాచారయత్నానికి యత్నించడం అటుగా వెళ్తున్న ఒక జాలరి చూశాడు. షాక్ తిన్న ఆ జాలరి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అకాన్‌ చేతులను వెనక్కి కట్టేసి అదుపులోకి తీసుకున్నారు.

Here's Tweet

కాగా బాలిక శవాన్ని పరిక్షించేందుకు వారి కుటుంబసభ్యుల అనుమతితో మరోసారి పోస్టుమార్టంకు తరలించామని, ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని ధనంజయ్‌ తెలిపారు. అకాన్‌ సైకియాపై ఫోక్సో చట్టంతో (Children from Sexual Offences (POCSO) Act) పాటు ఐపీసీ 306,377 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.  మొబైల్‌ను భార్యగా అనుకుని తాళి కట్టేశాడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వర్చువల్ వివాహం, అబ్బాయిది కేరళ, అమ్మాయిది ఉత్తరప్రదేశ్..

కేసులో నిందితుడిగా ఉన్న అకాన్‌ సైకియాపై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా అకాన్‌కు ఇప్పటికే రెండు సార్లు పెళ్లిళ్లయ్యాయి. 2018లో మొదటి భార్య గృహహింస కింద అకాన్‌పై కేసు పెట్టడంతో దేమాజీ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో జైళ్లో ఉంటే ఖైదీలకు కరోనా సోకే అవకాశం ఉండడంతో కేసులు తగ్గే వరకు పలువురు ఖైదీలకు పెరోల్‌ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో మార్చి నెలాఖరులో అఖాన్‌కు పెరోల్‌ రావడంతో జైలు నుంచి రిలీజయ్యాడు. అయితే బయటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి దురాఘతానికి పాల్పడడం వెనుక వైద్యులు అకాన్‌ మానసిక స్థితిని పరిక్షించారు. అకాన్‌ మహిళల పట్ల సైకోగా వ్యవహరించేవాడని తెలిసింది. కాగా బాలికను అకాన్‌ లైంగిక వేదింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని పలువురు గ్రామస్తులు ఆరోపించారంటూ ఎస్పీ ధనంజయ్‌ గానావత్‌ పేర్కొన్నారు.