7th Pay Commission | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, July 14: ఓ వైపు కరోనావైరస్, మరోవైపు ద్రవ్యోల్బణం పెరగడం... ఇలాంటి క్లిష్ట సమయంలో మోదీ సారథ్యంలోని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Central Government Employee's) శుభవార్తను అందించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (Dearness Allowance) చెల్లింపుపై కేంద్రం స్పందించింది. ఎటువంటి కోతలు లేకుండా ఉద్యోగులు ఊహించనట్టుగానే కరవు భత్యాన్ని పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ (DA Hiked to 28%) నిర్ణయం తీసుకుంది. అంటే ఏకంగా 11 శాతం డీఏను కేంద్రం పెంచింది. దీంతో 54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

7వ వేతన ఒప్పందం సంఘం సిఫార్సులను కేంద్రం పరిగణలోకి తీసుకుంది. పెంచిన డీఏను 2021 సెప్టెంబర్ నుంచి అమలు చేయనున్నారు. కరోనా కల్లోలం కారణంగా 2020 జనవరి నుంచి డీఏ పెంపు పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు 2021 జులై నుంచి కొత్త డీఏను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై పడింది.

కరోనా మూడో ముప్పు పొంచి ఉంటే క‌న్వ‌ర్ యాత్ర‌కు ఎందుకు అనుమతి ఇచ్చారు, సమాధానం చెప్పాలంటూ యోగీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, ఇప్పటికే కార్య‌క్ర‌మంపై నిషేధం విధించిన ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం

దీంతో ప్రభుత్వం డీఏ పెంచేందుకు అంగీకరించింది. మరోవైపు పెన్షనర్లకు సంబంధించి డీఆర్‌ పెంపుపై ఎటువంటి ప్రకటన రాలేదు. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ మూడు విడతల డీఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందనేలేదు. తాజా నిర్ణయంతో సెప్టెంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెరిగిన డీఏతో కలిసి జీతాలు తీసుకోనున్నారు.