Supreme Court | (Photo Credits: PTI)

New Delhi, July 14: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ యోగీ ఆధిత్యనాథ్ ప్ర‌భుత్వం క‌న్వ‌ర్ యాత్ర‌ను (Kanwar Yatra) నిర్వ‌హించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. కరోనావైరస్ మూడోముప్పు (COVID-19 Third Wave) పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. యోగీ ప్రభుత్వం కన్వర్ యాత్రకు అనుమతి ఇవ్వడంపై సుప్రీంకోర్టు (Supreme Court) అసహనం వ్యక్తం చేసింది.

ఈ క్లిష్ట సమయంలో యాత్రను ఎందుకు అనుమతించారో సమాధానం చెప్పాలంటూ ప్రభుత్వానికి (Yogi Govt) నోటీసులు జారీచేసింది. ఈ విషయాన్ని కోర్టు స్వయంగా పరిగణనలోకి తీసుకుంది. దీనికి సంబంధించిన తదుపరి విచారణ శుక్రవారం జరగనుంది.

కోవిడ్ వేళ ఆ యాత్ర‌ను ఎందుకు నిర్వ‌హిస్తున్నారో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆ రాష్ట్రాన్ని వివ‌ర‌ణ కోరింది. సుమోటోగా (Suo Motu Cognizance) సుప్రీంకోర్టు ఈ కేసును విచారించింది. కాగా బోళాశంక‌రుడి భ‌క్తులు క‌న్వ‌ర్ యాత్ర‌లో పాల్గొంటారు. వేలాది మంది భ‌క్తులు పాల్గొనే ఆ కార్య‌క్ర‌మంపై ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. కోట్లాది మంది పాల్గొనే మతపరమైన కార్యక్రమాలకు అనుమతులిస్తే కరోనా మూడోవేవ్‌కు అవకాశాలు పెరుగుతాయన్న వైద్య నిపుణుల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘ప్రజలు చనిపోవడాన్ని దేవుళ్లు కూడా కోరుకోరు’ అంటూ ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వ్యాఖ్యానించారు.

మళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 17, 18 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించిన కేరళ, దేశంలో తాజాగా 38,792 కోవిడ్ కేసులు, 3,09,46,074కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

కానీ యూపీ ప్ర‌భుత్వం మాత్రం త‌క్కువ సంఖ్య భ‌క్తుల‌తో వేడుక‌లు నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఆర్‌టీ పీసీఆర్ నెగ‌టివ్ ప‌త్రం అవ‌స‌ర‌మ‌ని కూడా స్ప‌ష్టం చేసింది. ప్ర‌తి ఏడాది శివ‌భ‌క్తులు ప‌విత్ర క‌న్వ‌ర్ యాత్ర చేప‌డుతారు. ఉత్త‌రాఖండ్‌లోని హిందువుల పుణ్య‌క్షేత్రాలైన‌ హ‌రిద్వార్‌, గోముఖ్‌, గంగోత్రికి భ‌క్తులు వెళ్లి అక్క‌డ నుంచి గంగాన‌ది నీటిని తీసుకువ‌స్తారు. సాధార‌ణంగా యూపీ, బీహార్ ప్ర‌జ‌లు ఈ యాత్ర‌లో పాల్గొంటారు.

ప‌విత్ర గంగాజ‌లాల‌ను తీసుకువ‌చ్చిన ఆ భ‌క్తులు.. స్థానికంగా ఉన్న శివాల‌యాల్లో ఆ నీటితో ప‌ర‌మేశ్వ‌రుడికి అభిషేకం చేస్తారు. అయితే ఈసారి ఉత్త‌రాఖండ్ ఆంక్ష‌లు విధించిన నేప‌థ్యంలో.. ప‌విత్ర గంగాజ‌లాల‌ను ట్యాంక‌ర్ల ద్వారా స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు ఆ రాష్ట్రం చెప్పింది. కానీ సుప్రీం మాత్రం యూపీ ప్ర‌భుత్వ వైఖ‌రిని ప్ర‌శ్నించింది.

దేశంలో తొలి కరోనా పేషెంట్‌కి మళ్లీ కరోనా, కరోనా టీకా తొలి డోసు తీసుకున్నప్పటికీ ఆమెకు పాజిటివ్, మళ్ళీ క్వారంటైన్‌లోకి వెళ్లిన కేరళ యువతి, ప్రసుత్తం నిలకడగా విద్యార్ధిని ఆరోగ్యం

రెండో దఫా కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలించాయి. దాంతో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రజలు పోటెత్తిన దృశ్యాలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. దీనిపై స్వయంగా ప్రధాని కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మనం ఆహ్వానిస్తేనే కరోనా వస్తుందని, వైరస్ నిబంధనలను ఉల్లంఘించ వద్దంటూ ప్రజలను హెచ్చరించారు.