Coronavirus in India: మళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 17, 18 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించిన కేరళ, దేశంలో తాజాగా 38,792 కోవిడ్ కేసులు, 3,09,46,074కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
Coronavirus Outbreak (Photo credits: IANS)

New Delhi, july 14: దేశంలో గత 24 గంటల్లో 38,792 క‌రోనా కేసులు (3,09,46,074కు) న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 41,000 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,46,074కు చేరింది. మరణాల విషయానికొస్తే... నిన్న‌ 624 మంది క‌రోనాతో ప్రాణాలు (624 Deaths in Past 24 Hours) కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,11,408కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి (COVID-19 in India) ఇప్పటివరకు 3,01,04,720 మంది కోలుకున్నారు. 4,29,946 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 38,76,97,935 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న 37,14,441 డోసులు వేశారు.

కరోనావైరస్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 17, 18 (శని, ఆదివారాలు) తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీచేసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ఉన్న కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షల్లో సడలింపులు ఇచ్చింది. కేరళలో ప్రస్తుతం 196 స్థాని సంస్థలు ఉన్నాయి.

దేశంలో తొలి కరోనా పేషెంట్‌కి మళ్లీ కరోనా, కరోనా టీకా తొలి డోసు తీసుకున్నప్పటికీ ఆమెకు పాజిటివ్, మళ్ళీ క్వారంటైన్‌లోకి వెళ్లిన కేరళ యువతి, ప్రసుత్తం నిలకడగా విద్యార్ధిని ఆరోగ్యం

కేసుల నమోదునుబట్టి వీటిని మూడు భాగాలుగా విభజించింది. వాటి ఆధారంగా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు గురువారం తెల్లవారుజామున 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. రాష్ట్రంలో నిన్న కొత్తగా 14,539 కేసులు నమోదయ్యాయి. 124 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 30,87,673కు, మరణాలు 14,810కి చేరాయి.