New Delhi, Feb 12: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia Bail) మూడు రోజులు బెయిల్ మంజూరు అయింది. మేనకోడలి పెళ్లికి హాజరయ్యేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు మూడు రోజుల బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌ను ఇచ్చింది.వివాహ వేడుకకు హాజరయ్యేందుకు లక్నో వెళ్లాల్సి ఉండగా.. ఈ నెల 13 నుంచి 15 వరకు బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే, బెయిల్ పిటిషన్‌పై వ్యతిరేకంగా వాదనలు వినిపించినా.. కోర్టు బెయిల్‌ను ఇచ్చింది.
ఇంతకు ముందు ఆయనకు వారానికి ఒకరోజు అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను కలిసేందుకు అవకాశం కల్పించింది. ఆయన భార్య సీమా సిసోడియా గత 23 సంవత్సరాలుగా న్యూరో సంబంధిత వ్యాధి మల్టిపుల్ స్ల్కెరోసిస్‌తో బాధపడుతున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీష్ సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఆ తర్వాత సీబీఐ ఎఫ్‌ఐఆర్‌పై ఈడీ మార్చి 9న మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.