Taraka Ratna Hospitalised (Photo Credits: Instagram, ANI)

Bangalore, JAN 29: గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న (taaraka ratna) కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ.. ట్రీట్‌మెంట్‌కు రెస్పాండ్‌ అవుతున్నాడని అటు నందమూరి బాలకృష్ణ.. ఇటు జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr. NTR) ఇప్పటికే తెలియజేశారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో నందమూరి ఫ్యామిలీని పరామర్శించిన మంచు మనోజ్‌ (Manchu manoj) కూడా ఇప్పుడు ఇదే చెబుతున్నాడు. తొందరలోనే రికవరీ అయి మన ముందుకు వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. దీంతో తారకరత్న ఆరోగ్యంపై నిన్నటి దాకా టెన్షన్‌ పడ్డ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయకు వెళ్లిన మంచు మనోజ్‌.. ఐసీయూలో ఉన్న తారకరత్నను (taraka ratna) చూశారు. అనంతరం నందమూరి ఫ్యామిలీని పరామర్శించారు.

ఈ సందర్భంగా మంచు మనోజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్నను చూశానని రికవరీ అవుతున్నాడని చెప్పాడు. చిన్నప్పటి నుంచి తారకరత్నను చూస్తున్నానని.. మొదట్నుంచి అతను చాలా స్ట్రాంగ్‌ పర్సన్‌ అని తెలిపాడు. తొందరలోనే రికవరీ అయి మన ముందుకొస్తాడని చెప్పాడు. ప్రతి ఒక్కరికీ లైఫ్‌లో ఏదో ఒక కష్టం వస్తుంటుంది అని.. తారకరత్నకు ఇది టెస్టింగ్‌ టైమ్‌ అని అభిప్రాయపడ్డాడు.తారకరత్న కోలుకుని, తిరిగివస్తాడని 100 శాతం నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. వైద్యులు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో కూడా ఒక పోస్టు చేశాడు.