బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కదులుతున్న రైలు డోర్ తీసి ఫుట్ బోర్డ్ పై కూర్చొని ప్రయాణం చేసిన వీడియోని డిసెంబర్ 13వ తేదీన తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన సంగతి విదితమే. ఈ వీడియోలో వేగంగా వెళ్తున్న రైలులో డోర్ పక్కన కాళ్లపై ప్రమాదకరమైన రీతిలో సోనూ కూర్చున్నారు.
దీనిపై తాజాగా స్పందించిన నార్నర్త్ రైల్వే ఇది చాలా ప్రమాదకరం అంటూ నటుడిని మందలించింది. భారత ప్రజలకు సోనూ సూద్ రోల్ మోడల్ అని, ఇలాంటి వీడియోతో దేశానికి తప్పుడు సందేశం ఇచ్చినట్టు అవుతుందని పేర్కొంది. ఇలా చేయ వద్దని కోరింది. ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ కూడా సోనూసూద్‌ను హెచ్చరించింది. ఇది ప్రమాదకరమని, నిజ జీవితంలో అలా చేయరాదని పేర్కొంది.
Here's Northern Railway Tweet
प्रिय, @SonuSood
देश और दुनिया के लाखों लोगों के लिए आप एक आदर्श हैं। ट्रेन के पायदान पर बैठकर यात्रा करना खतरनाक है, इस प्रकार की वीडियो से आपके प्रशंसकों को गलत संदेश जा सकता है।
कृपया ऐसा न करें! सुगम एवं सुरक्षित यात्रा का आनंद उठाएं। https://t.co/lSMGdyJcMO
— Northern Railway (@RailwayNorthern) January 4, 2023
అభిమానులు సైతం సోనూ సూద్ చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మందికి సాయం చేసి, స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఇలా ప్రమాదకరమైన పనలు చేయకూడదని సూచించారు.