Samatha Case: సమత అత్యాచారం, హత్య కేసులో మరణ శిక్ష విధించిన ఆదిలాబాద్ ప్రత్యేక కోర్ట్, కన్నీళ్లు పెట్టుకున్న దోషులు
Court Judgment, representational image | File Photo

Adilabad, January 30: సమత అత్యాచారం, హత్య కేసులో (Samatha Rape and Murder Case) ముగ్గురు నిందితులను దోషిగా తేల్చిన ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు (Adilabad Special Court) వారికి ఉరిశిక్ష విధిస్తూ గురువారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎ1గా షేక్ బాబు (30), ఎ2 గా షేక్ షాబుద్దీన్ (40), ఎ3 గా షేక్ మక్దం (30) లు ఉన్నారు.  వీరిని ధర్మాసనం దోషులుగా నిర్ధారిస్తూ మరణ శిక్ష (Death Penalty) ఖరారు చేసింది.

అంతేకాకుండా వీరిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైనందున, దానికి కింద కూడా ఈ ముగ్గురు నేరస్తులకు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఎస్సీ / ఎస్టీ కేసు కింద ఏ1కి రూ. 8 వేలు జరిమానా విధించింది. బాధితురాలిని దోపిడీ కూడా చేసినందున ఆ కేసుకు సంబంధించి మళ్ళీ ఈ ముగ్గురుకి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు ఒక్కొక్కరు రూ. 9 వేలు నష్ట పరిహారం చెల్లించాలని ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు 3 తీర్పులను వెలువరించింది.

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి, నేడు తుది తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. న్యాయమూర్తి మరణ శిక్ష ఖరారు చేసినపుడు ఏ1 షేక్ బాబు కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకు ముసలి తల్లిదండ్రులు, చిన్న పిల్లలు ఉన్నారని క్షమించమని వేడుకున్నారు. మిగతా ఇద్దరూ కూడా దయ చూపండి అంటూ న్యాయమూర్తి ఎదుట ప్రాధేయపడ్డారు. అయితే దోషులు చేసిన నేరం,  అత్యంతహేయమైనది, ఘోరమైనదిగా చెబుతూ వారికి మరణ శిక్షను ఖరారు చేశారు.

హైదరాబాద్ లో 'దిశ హత్యాచారం' ఘటనకు మూడు రోజుల ముందు 2019, నవంబర్ 24న కొమరం భీమ్ జిల్లా (గతంలో ఆదిలాబాద్) లోని లింగాపూర్ మండలం, ఎల్లపత్తర్ గ్రామంలో వంట పాత్రలు అమ్ముకునే 30 ఏళ్ల సమతను ఒంటరిగా ఉండటం గమినించిన ఏ1 షేక్ బాబు ఆమెను పంటపొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం జరిపాడు. అందుకు మిగిలిన ఇద్దరు సహకరించారు. ఆపై ముగ్గురు కలిసి ఆమెను దారుణంగా హింసిస్తూ హింసిస్తూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు, తమ వెంట తెచ్చుకున్న కోళ్లను కోయడానికి ఉపయోగించి 29 సెంటీమీటర్ల కత్తితో ఆమె గొంతుకోశారు. విడిచిపెట్టమని బాధితురాలు ఎంత ప్రాధేయపడినా కనికరించకుండా ఆమె చేతులు, వేల్లు, ఇతర శరీర భాగాలపై బలంగా పొడిచారు. లోతైన గాయాలు కావడంతో, తీవ్ర రక్తస్రావం జరిగి సమత అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఆమె మొబైల్ ఫోన్, ఆమె కష్టపడి సంపాదించుకున్న రూ. 200 ను కూడా ఎత్తుకెళ్లి అక్కడ్నించి ఉడాయించారు. దిశ హత్యాచారం జరిగిన రోజే ఈ ముగ్గురూ పోలీసులకు పట్టుబడ్డారు.

వ్యక్తులు పాత్రలు అమ్ముతున్న 30 ఏళ్ల వీధి విక్రేతపై అత్యాచారం జరిగిందని, ఆమె గొంతు కోసిందని ఆరోపించారు. నిందితుడు షేక్ బాబు, షేక్ షాబోద్, షేక్ ముక్దుం మత్తులో లేరని, బాధితురాలిని హింసించి, ఆమె శరీరాన్ని నరికి చంపారని, ఆమె నుంచి డబ్బు (ఆర్‌ఎస్ 200), సెల్ ఫోన్ కూడా దొంగిలించారని చెప్పారు. వారు ఆమెను తీవ్రంగా హింసించడమే కాక, ఆమె తన గుర్తింపును బహిర్గతం చేస్తుందనే భయంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు మరియు ఆమెను విడిచిపెట్టమని ఆమె విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆమె గొంతు కోసింది.

ఈ కేసును దర్యాప్తు చేయాలని ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. దీంతో డిసెంబర్ 14న పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసి, డిసెంబర్ 23 నుండి 31 వరకు సాక్షులను ప్రశ్నించారు. తరువాత, ప్రాసిక్యూటర్ మరియు డిఫెన్స్ న్యాయవాది వాదనలను విన్న కోర్టు, జనవరి 30న తుది తీర్పును ఇచ్చింది.