Cyclone-Rain-forecast- (Photo-Twitter)

New Delhi, Nov 27: నివర్ తుఫాను తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అతలాకుతలం చేసిన విషయం విదితమే. దాని ప్రభావం ఇంకా అలాగే ఉంది. అయితే నివర్ తుఫాను (Cyclone Nivar) కల్లోలం మరచిపోకముందే మరో పెను ప్రమాదం ముంచుకొస్తోంది. నివర్ తుఫాను ప్రభావానికి మరో తుఫాను తోడు కానుందని చెన్నైలోని భారత వాతావరణ విభాగం మరో హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం (Another Low Depression) ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం ఆదివారం నాటికి బలపడి తుపానుగా మారే అవకాశం (Another Low Depression Forming In Bay Of Bengal) ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

దీంతో పాటుగా డిసెంబర్‌ నెలలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. డిసెంబర్‌2న 'బురేవి తుఫాన్' తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమ పై దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో 'టకేటి తుఫాన్' ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్‌ 7న డిసెంబరు 7 తేదీ దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇంకా 6 గంటలు..ఏపీలో వణికిన 8 జిల్లాలు, ఈ రోజు కూడా కొనసాగనున్న నివర్ తుఫాను బీభత్సం, వేల ఎకరాల్లో పంట నష్టంతో కుదేలైన రైతన్న

బంగాళాఖాతంలో పురుడుపోసుకున్న నివర్ తుపాను పుదుచ్చేరి వద్ద గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. నివర్ తుపాను కారణంగా తమిళనాడులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో 1000కిపైగా వృక్షాలు నేలమట్టమయ్యాయి. తమిళనాడు, పుదుచ్చేరిలను అతలాకుతలం చేసింది. సాధారణ జన జీవితాలను అస్తవ్యస్తం అయ్యాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.