చైనా హ్యాకర్లు ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లను హ్యాక్ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఎయిమ్స్‌లో దాదాపు 100 సర్వర్లు హ్యాకింగ్‌కు గురైనట్లు పేర్కొన్నారు. ఇందులో కొన్నింటిని తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలిపాయి. ఈ సర్వర్లలో డేటాను పునరుద్ధరించినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
హ్యాకింగ్ నేపథ్యంలో ఎయిమ్స్‌కు సంబంధించిన అన్ని సేవలు మ్యానువల్‌గా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఎయిమ్స్‌లో సర్వర్లు మొరాయించినట్లు గత నెల 23న తొలిసారి గుర్తించారు. ఆ తర్వాత హ్యాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో మొత్తం 5 వేలకు పైగా కంప్యూటర్లు ఉండగా, ఇప్పటి వరకు 1200లకు పైగా కంప్యూటర్లలో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ వేసినట్లు ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి.