Gitam medical student helps woman give birth to a baby girl on board Secunderabad-Visakhapatnam Duronto Express (Photo Source-TOI)

VJy, Sep 14: గీతం వైద్య కళాశాలలో మెడిసిన్ చదువుతున్న ఓ ఫైనల్ ఇయర్ విద్యార్థి (Gitam medical student) రైలులో ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చేందుకు ఒక మహిళకు సహాయం చేసింది. సికింద్రాబాద్-విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్ లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వార్త వివరాలను పరిశీలిస్తే, విజయవాడ నుంచి విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు (Secunderabad-Visakhapatnam Duronto Express) సోమవారం రాత్రి బయలుదేరింది. ఈ రైలులో వైజాగ్ గీతం మెడికల్ కాలేజీకి చెందిన హౌస్ సర్జన్ స్వాతిరెడ్డి కేసరి సోమవారం రాత్రి విజయవాడలో విశాఖకు బయల్దేరారు.

ఆమె ఎక్కిన బి6 బోగీలోనే శ్రీకాకుళానికి చెందిన సత్యవతి (28), ఆమె భర్త ప్రయాణిస్తున్నారు.కాగా సత్యవతి నిండు గర్భిణి. డెలివరీకి ఇంకా నాలుగు వారాల సమయం ఉండటంతో పుట్టింటికి వెళుతోంది. అయితే అనుకోకుండా ఆమెకు మంగళవారం తెల్లవారుజామున 3.35 గంటల సమయంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. మరో స్టేషన్ వచ్చేవరకు ఆస్పత్రికి తరలించే అవకాశం లేకపోవడంతో ఆమె భర్తలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.

దారుణం, కూతురికి మళ్లీ పెళ్లి చేశాడని తండ్రి ముక్కు చెవులు కోసిన మాజీ అత్తింటివారు, ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య బాధితుడు

భయంతో పక్కనే ఉన్న స్వాతి రెడ్డి బెర్త్ వద్దకు వచ్చి ఆమెను నిద్రలేపారు. తన భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయని, సాయం చేయాలని కోరారు. స్వాతిరెడ్డి డాక్టర్ చదువుతున్న విద్యార్థి కావడంతో వెంటనే స్పందించి 15 నిమిషాల్లోనే నార్మల్ డెలివరీ (woman give birth to a baby girl ) చేశారు.ఒక్క పరికరం లేకుండానే బెడ్ షీటు అడ్డంగా పెట్టి పురుడు పోశారు.తెల్లవారుజామును 5.30 గంటలకు రైలు అనకాపల్లి చేరడంతో స్వాతిరెడ్డి వారిని.. అప్పటికే సిద్ధంగా ఉన్న 108 వాహనంలో ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి.. తదుపరి వైద్యం అందించారు.

అన్నవరం దగ్గర తెల్లవారుజామున 5.35 గంటలకు డెలివరీ అయినప్పటికీ, విజయవాడ-విశాఖపట్నం మధ్య ఎక్కడా ఆగకపోవడంతో ఆసుపత్రిని కనుగొనడానికి గంటన్నర పట్టిందని స్వాతి చెప్పారు.నవజాత శిశువులను వెచ్చగా ఉంచాలి. కానీ అది ఏసీ బోగీ. ప్రయాణికులు తమ దుప్పట్లను పిల్లలకు చుట్టి ఇచ్చారు. చాలా మంది ప్రయాణికులు కంపార్ట్‌మెంట్‌ను తాత్కాలిక డెలివరీ రూమ్‌గా మార్చడం ద్వారా డెలివరీ చేయడంలో చాలా సహాయపడ్డారని తెలిపారు.వైద్య విద్యార్థిని తల్లీబిడ్డలను వెంటబెట్టుకుని ఆసుపత్రికి వెళ్లి వైద్యులకు అప్పగించి నెలలు నిండకుండానే ప్రసవం గురించి తెలియజేసింది. వైద్య విద్యార్థినిని ఆమె కళాశాల సహచరులతో పాటు ప్రిన్సిపాల్ కూడా అభినందించారు.పురుడు పోసి తల్లీబిడ్డలను కాపాడిన స్వాతిరె డ్డికి సత్యవతి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.