New Dlehi, Febuary 8: దేశంలోనే అత్యంత సంపన్నుడు, ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానంలో కొనసాగిన రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Reliance Group chairman Anil Ambani) గత కొద్ది కాలంగా వ్యాపారంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఓ దావాను ఎదుర్కొంటున్న అనిల్ అంబానీ (Anil Ambani) , తాజాగా తన ఆస్తులు సున్నాకు పడిపోయాయని లండన్ కోర్టుకు (UK Court) తెలిపారు.
ఇప్పుడు అనిల్ అంబానీ పరిస్థితి దారుణంగా ఉంది. చైనా బ్యాంకులకు (China Banks) సుమారు 680 మిలియన్ల డాలర్లు ఆయన చెల్లించాల్సి ఉంది. భారీ రుణాలను తీసుకున్న అనిల్ అంబానీ వాటిని చైనా బ్యాంకులు కట్టాలని ఇవాళ బ్రిటన్ కోర్టు తీర్పునిచ్చింది.
ఒకప్పుడు వేల కోట్ల ఆస్తులు ఉండేవని, కానీ ఇప్పుడు అనిల్ దగ్గర అంత సొమ్ము లేదని ఆయన తరపున న్యాయవాది ఇవాళ కోర్టులో తెలిపారు. 2012 ఫిబ్రవరిలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కోసం అనిల్ అంబానీ చైనా బ్యాంకుల నుంచి 925 మిలియన్ల డాలర్ల రుణం తీసుకున్నారు. లండన్‌లోని కమర్షియల్ డివిజన్ కోర్టు ఈ కేసును విచారించింది.
అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు అనిల్ అంబానీ కొత్త వ్యూహం
తాజాగా ఆ కోర్టు ఈ కేసులో ఆదేశాలు జారీ చేసింది. తాను చేసిన పెట్టుబడులన్నీ దివాళా తీసినట్లు అనిల్ కోర్టుకు తెలుపుకున్నారు. ప్రస్తుతం తన అకౌంట్‌లో జీరో సొమ్ము ఉన్నట్లు ఆయన చెప్పారు. బ్యాంకుల రుణం తీర్చాలంటే అమ్మేందుకు తన దగ్గర అంత ఆస్తులు లేవన్నారు.
ఈ కేసులో పూర్తి విచారణ పెండింగ్‌లో ఉన్న కోర్టులో అనిల్ అంబానీ 100 మిలియన్ డాలర్లు చెల్తించాలని యూకే కోర్టు ఆదేశించింది. దీనికి ఆరు వారాల గడువు విధిస్తున్నట్లు జడ్జి చెప్పారు. తన నికర విలువ సున్నా అంటూ అంబానీ యొక్క వాదనను తాను అంగీకరించలేనని తేల్చిచెప్పారు. కాగా ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ ముంబై బ్రాంచ్, చైనా డెవలప్మెంట్ బ్యాంక్ మరియు ఎక్సిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా ఈ ఉత్తర్వును స్వాగతించాయి. విచారణలో విజయం సాధిస్తాయని తాము విశ్వసిస్తున్నామని చెప్పారు.
తమ దావాపై చాలా నమ్మకంగా ఉన్నామని ఓ ప్రకటనలో మూడు బ్యాంకులు తెలిపాయి. అంబానీ కోర్టు ఆదేశాలను పాటిస్తారని ఆశిస్తున్నామని, విచారణలో కేసు శీఘ్ర పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటన తెలిపింది. అయితే ఈ తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ చేయాలని యోచిస్తున్నట్లు రిలయన్స్ గ్రూప్ తెలిపింది.