Rishikesh, SEP 24: ఉత్తరాఖండ్‌ లో (Uttarakhand) ఉద్రిక్తతలకు దారితీసిన రిషికేశ్ యవతి హత్య కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. యువతిని రేప్ చేసి చంపేశారా? అసలు హత్యకు కారణమేంటి? అన్న దానిపై భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా యువతి వాట్సాప్ చాట్ (WhatsApp Chat) ఒకటి నెట్‌ లో వైరల్ గా మారింది. రిసార్టుకు వచ్చే అతిథులకు స్పెషల్ సర్వీసులు (Special Services) అందించకపోవడం వల్లనే ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. స్పెషల్ సర్వీసులు (Special Services) అందించేందుకు నిరాకరించడం వల్లే ఆమెను హత్యచేసినట్లు ఇప్పటికే పోలీసులు తెలిపారు. రిసార్టుకు వచ్చే అతిథులతో సెక్స్ చేయాలని యువతిపై యజమాని ఒత్తిడి తెచ్చాడని, అందుకు ఆమె నిరాకరించడంతో ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. కాగా ఆ యువతిపై అమానుషానికి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది.

Uttarakhand: హత్యకేసులో బీజేపీ నేత కుమారుడు, 19 ఏళ్ల యువతిని చంపి కాలువలో పడేసిన బీజేపీ నేత కుమారుడు, 5 రోజుల తర్వాత దొరికిన మృతదేహం, ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు, రిసార్ట్ కు నిప్పుపెట్టి ఆందోళన 

తనను వ్యభిచార కూపంలోకి లాగేందుకు యత్నిస్తున్నారని వాట్సాప్‌లో స్నేహితుడితో ఆమె మొరపెట్టుకున్న స్క్రీన్ షాట్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘వారు నన్ను వేశ్యగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని అందులో యువతి మెసేజ్ చేసింది. రూ.10వేలకు ‘స్పెషల్ సర్వీస్‌’ చేయాలని రిసార్టు యజమాని ఒత్తిడి తెస్తున్నట్లు కూడా అందులో తెలిపింది.

Ankita Bhandari Murder Case: రేప్ చేసి చంపేశారా, బీజేపీ నేత రిసార్ట్‌లో రిసెప్ష‌నిస్ట్ హత్య కేసులు షాకింగ్ విషయాలు, పార్టీ నుంచి వినోద్ ఆర్య సస్పెండ్, పుల్‌కిత్ ఆర్య‌ అరెస్ట్ 

కాగా పోలీసులు సైతం ఈ మెసేజ్‌లపై స్పందించారు. ఆ స్క్రీన్ షాట్లలోని మెసేజ్‌లు సదరు యువతికి సంబంధించినవేనని.. దీనిపై మరింత స్పష్టత కోసం ఫోరెన్సిక్‌ పరీక్షలు అవసరమని పేర్కొన్నారు. సాయం చేయాలంటూ రిసార్టు ఉద్యోగితో మాట్లాడిన ఓ ఫోన్‌ కాల్‌ సైతం వైరల్‌గా మారింది. తన బ్యాగు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాలని ఉద్యోగిని అందులో అభ్యర్థించింది. అయితే, బ్యాగు తీసుకొని అక్కడికి వెళితే ఆమె కనిపించలేదని ఆ వ్యక్తి చెప్పినట్లు సమాచారం.

కాగా ఈ హత్యకు సంబంధించిన వివరాలను రాష్ట్ర డీజీపీ అశోక్‌ కుమార్ తాజాగా వెల్లడించారు. రిషికేశ్‌ దగ్గర్లో వనతారా రిసార్టుకు (Resort) వచ్చే అతిథులకు అక్కడ రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోన్న యువతి ‘ప్రత్యేక సేవలు’ అందించేందుకు నిరాకరించడం వల్లే వారు ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఆ యువతి తన ఫేస్‌బుక్‌ స్నేహితుడితో జరిపిన చాటింగ్ ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ కేసులో బీజేపీ నేత వినోద్‌ ఆర్య కుమారుడు, రిసార్టు యజమాని పులకిత్‌ ఆర్య, అతడి సిబ్బందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.