ap-cm-ys-jagan-launched-call-center-complaint-against-corruption (Photo-Twitter)

Amaravathi, November 26: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister Y.S. Jagan Mohan Reddy) పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకుపోతున్నారు. తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి (YSR)పాలనను తలపిస్తున్నారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేందుకు పలు కార్యక్రమాలను ఏపీలో చేపడుతున్నారు. ఇందులో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు‘ 14400 కాల్‌ సెంటర్‌’(anti-corruption helpline)ను ఏర్పాటు చేసింది. ఏపీ సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కాల్ సెంటర్‌(Jagan launches anti-corruption helpline)ను ప్రారంభించారు.

‘ఎప్పుడైనా ఎక్కడైనా అవినీతి మీ దృష్టికి వస్తే వెంటనే గళం ఎత్తండి.. 14400 నంబర్‌కు ఫోన్‌ చేయండి’ అనే నినాదం ఉన్న పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నేరుగా కాల్‌ సెంటర్‌(Call Center)కు ఫోన్‌ చేసి, ఫిర్యాదులను స్వీకరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకునే చర్యలు, కాలవ్యవధి, తదితర విషయాల గురించి కాల్‌ సెంటర్‌ ఉద్యోగితో మాట్లాడారు. కొన్ని సూచనలు కూడా చేశారు.

YSRCP MP Vijayasai Reddy Tweet

ఫిర్యాదు అందిన 15 రోజుల నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి దానిపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం (AP CM) ఆదేశించారు. బాధితుల ఫిర్యాదులపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం తగదని, కచ్చితంగా జవాబుదారీతనంతో పని చేయాలన్నారు. వ్యవస్థపై నమ్మకం కలగాలంటే కాల్‌సెంటర్‌కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించడంతోపాటు సంబంధిత శాఖల అధికారులు కూడా వాటిని పరిష్కరించడంలో చొరవ తీసుకోవాలని ఆదేశించారు.

కాగా ఇసుక అక్రమాలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 14500 కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తప్పిదాలకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంది. ఇసుక అక్రమాలను అరికట్టడానికి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని తగ్గించడానికి అధ్యయనం, సిఫార్సుల కోసం ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్‌ సంస్థ అహ్మదాబాద్‌ ఐఐఎంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.