Marriage| Representational Image (Photo Credits: unsplash)

New Delhi, June 03: ఆర్య సమాజ్ (Arya Samaj)లో జరిగే పెళ్లిళ్లపై (Marriage) సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్య సమాజ్ లు ఇచ్చే వివాహ ధ్రువపత్రాలు చెల్లవని స్పష్టం చేసింది. ఆర్యసమాజ్ ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికెట్లను (Marriage certificates) గుర్తించబోమని తెలిపింది. అధికారులు ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికెట్లకే గుర్తింపు ఉంటుందని పేర్కొంది. పెళ్లిళ్లు చేయడం ఆర్య సమాజ్ పనికాదని స్పష్టం చేసింది. మ్యారేజ్ సర్టిఫికెట్లు ఇవ్వడం ఆర్య సమాజ్ (Arya Samaj)పనికాదని వెల్లడించింది. ఆర్య సమాజ్ వివాహ ధ్రువ పత్రాలకు చట్టబద్ధత లేదని తెలిపింది. వివాహ ధ్రువ పత్రాలు ఇచ్చే పని ఆర్య సమాజ్ ది కాదు..వివాహ ధ్రువపత్రాలు ఇచ్చే పని అధికారులదని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌లో ప్రేమ వివాహంపై (Love Marriage) నమోదైన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) ఈ తీర్పు వెల్లడించింది.

Uttarakhand: ఉప ఎన్నికలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం, ప్రత్యర్థి పై 55 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపు 

ఓ యువకుడు తమ కుమార్తెను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడని మధ్యప్రదేశ్ లో బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తె మైనర్ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసును సవాల్ చేస్తూ ఆ యువకుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. బాలిక మేజర్ అని, ఆమె ఇంటి నుంచి వచ్చి ఇష్టపూర్వకంగానే తనను పెళ్లి చేసుకున్నట్లు పిటిషన్ లో పేర్కొన్నాడు. తమ వివాహం ఆర్యసమాజ్ మందిర్‌లో జరిగిందని చెప్పాడు.

Sidhu Moose Wala Murder: పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక మలుపు, ఇది తన ముఠా పనే అని గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ తెలిపినట్లుగా వార్తలు 

కేంద్ర భారతీయ ఆర్య ప్రతినిధి సభ జారీ చేసిన వివాహ ధ్రువ పత్రాన్ని కూడా సుప్రీంకోర్టుకు సమర్పించాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఆ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని తిరస్కరించింది. ఆర్యసమాజ్ జారీ చేసిన వివాహ ధ్రువ పత్రానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్యసమాజ్ పని వివాహ ధ్రువ పత్రాలను జారీ చేయడం కాదని… వాటికి ఆ అర్హత లేదని తెలిపింది. కేవలం చట్టపరంగా సమర్థవంతమైన అధికారులు మాత్రమే వివాహ ధ్రువ పత్రాలను జారీ చేయగలరు. మీ కేసులో అలాంటి ధ్రువ పత్రాలు ఉంటే కోర్టు ముందుంచాలని ధర్మాసనం పేర్కొంది.

ఆర్య సమాజ్ (Arya Samaj) అనేది హిందూ సంస్కరణల సంస్థ, దీనిని 1875లో స్వామి దయానంద్ సరస్వతి స్థాపించారు. సనాతన హిందూమతంలో సంస్కరణలు తీసుకురావాలని, వేదాలపై విశ్వాసంతో విలువలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్థాపించారు. అదే సమయంలో పౌరుల హక్కుల కోసం ఈ సంస్థ పనిచేస్తోంది. కులాంతర వివాహాలను ఆర్య సమాజ్ ప్రోత్సహిస్తోంది. దీంతో ప్రేమ వివాహాలకు వేదికగా మారిందని చెప్పవచ్చు.