High Court of Telangana | (Photo-ANI)

Hyd, April 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసులో (Amnesia Pub Case) కీలక మలుపు చోటు చేసుకుంది. ఆరో నిందితుడిగా ఉన్న మైనర్ బాలుడిని మేజర్‌గా పరిగణించాలంటూ గతంలో పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. మైనర్‌గానే పరిగణించి దర్యాప్తు చేయాలని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఈ కేసులో వక్స్ బోర్డ్ చైర్మన్ కొడుకుని మైనర్‌గా పరిగణిస్తూ హైకోర్టు (Telangana High Court) ఆదేశాలు జారీ చేసింది. జువెనైల్ కోర్టులో మేజర్‌గా పరిగణిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలపై వక్స్ బోర్డ్ చైర్మన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కాసేపటి క్రితమే హైకోర్టులో వాదనలు జరుగగా వక్స్ బోర్డ్ చైర్మన్‌ కొడుకును మైనర్‌గా పరిగణిస్తూ.. ఫోక్సో చట్టం కింద విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించింది.

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్ రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు, ఎమ్మెల్యే కొడుకు తప్ప మిగతా అందరినీ మేజర్లుగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చిన జువైనల్‌ జస్టిస్‌ బోర్డు

2022 మే 28 స్నేహితులతో కలిసి ఫ్రెషర్స్ పార్టీకి వెళ్లిన బాలికపై సామూహిక హత్యాచారం జరగడం కలకలం రేపింది. ఈ విషయాన్ని బాలిక స్వయంగా మీడియాకు తెలియజేయడంతో కేసు నమోదు చేసి ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌తో పాటు ఐదుగురు మైనర్లు నిందితులుగా ఉన్నారు. ఐదుగురు మైనర్లలో నలుగురిని మేజర్లుగానే పరిగణించాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్‌ వేశారు. తీవ్రమైన కేసులో మైనర్లను మేజర్లుగా పరిగణించాలని కోరారు.

అంతా ముందుగానే ప్లాన్.. ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం, జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక అ‍త్యాచార కేసు వివరాలను వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్

ఐదుగురు మైనర్లలో నలుగురిని మేజర్లుగా పరిగణిస్తూ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది. పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆరో నిందితుడిగా ఉన్న మైనర్‌ హైకోర్టుకు వెళ్లాడు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పోక్సో కోర్టు తీర్పును కొట్టేసింది. దీంతో ఈ కేసులో ఇప్పుడు నలుగురు మేజర్లు, ఇద్దరు మైనర్లు నిందితులుగా ఉన్నట్లయింది.