Assam Floods Pic Credit- ANI

Guwahati (Assam) [India], May 18: అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు (Assam Floods) వెల్లువెత్తుతున్నాయి. 27 జిల్లాల్లోని 1,089 గ్రామాలు వరదనీటిలో మునిగిపోవడంతో (Heavy Downpour Wreaks Havoc) పాటు పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరద విపత్తుకు 9 మంది ప్రాణాలు కోల్పోవడంతో మరో ఐదుగురు గల్లంతు అయ్యారు. వరదల వల్ల కాచర్‌లో ఇద్దరు, ఉదల్‌గురిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడటంతో డిమా హసావోలో నలుగురు, లఖింపూర్‌లో ఒకరు మరణించారు.

నాగావ్ జిల్లాలో మరో ఐదుగురు అదృశ్యమయ్యారు. ఆరు లక్షల మందికి పైగా ప్రజలు (Over 6 Lakh Affected Across 27 Districts) వరదల బారిన పడ్డారు.భారీ వర్షాల వల్ల నాగావ్ జిల్లాలో వరద పరిస్థితి మరింత దిగజారింది. కాచర్‌లో 40,000 మంది ప్రజలు వరద విపత్తులతో అల్లాడుతున్నారు.సైన్యం, పారా మిలటరీ బలగాలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర పోలీసుల అగ్నిమాపక, అత్యవసర బలగాలు వరదనీటిలో చిక్కుకున్న 3,427 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.142 సహాయ శిబిరాలు, 115 సహాయ పంపిణీ కేంద్రాలను ఆయా జిల్లాల యంత్రాంగం ఏర్పాటు చేసింది.

దేశంలో కరోనా కేసుల్లో మళ్లీ పెరుగుదల, కొత్తగా 2364 మందికి కరోనా, గత 24 గంటల్లో 10 మంది మృతి, 15,419 కేసులు యాక్టివ్‌

39, 558 మంది వరద బాధితులకు ఆశ్రయం కల్పించారు. కొపిలి, దిసాంగ్, బ‌రాక్ న‌దులు డేంజ‌ర్ లెవ‌ల్‌లో ప్ర‌వ‌హిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గౌహతి ఆధారిత ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, రానున్న రెండు రోజుల పాటు వర్షాలు మరింత కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

వరద బాధిత జిల్లాలకు అస్సాం ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్రం రూ. 1,000 కోట్లు మంజూరు చేసిందన్నారు.వరద బాధిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల సరఫరాను కొనసాగించేందుకు, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రైల్వే లింక్ పునరుద్ధరించడానికి దాదాపు 45 రోజులు పడుతుందని, రెండు-మూడు రోజుల్లో రోడ్డు కనెక్టివిటీని పునరుద్దరిస్తామని సీఎం తెలిపారు.

ప్రస్తుతం కంపూర్, ధర్మతుల్ వద్ద కోపిలి నది, నంగ్లమురఘాట్ వద్ద దిసాంగ్ నది, ఏపీ ఘాట్ వద్ద బరాక్ నది, కరీంనగర్ వద్ద కుషియారా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. అయితే రానున్నఈ ప్రాంతంలో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గౌహతి ఆధారిత ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వరదనీరు పోటేత్తడంతో దిమా హసావ్ ప్రాంతంలోని హాఫ్లాంగ్ రైల్వే స్టేషన్‌ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. స్టేషన్‌లోని రెండు రైళ్లు పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయి. గౌహతి-సిల్చార్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన కొన్ని బోగీలు తిరగబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే ముందే ప్రమాద తీవ్రతను అంచనా వేసిన అధికారులు ప్రయాణికులను సురక్షితంగా తరలించడంతో ప్రాణ నష్టం తప్పింది. రైల్వే అధికారులు 29 రైళ్లను నిలిపివేశారు. ప్యాసింజర్ రైళ్లలోని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.