Guwahati, June 10: అస్సాం, తినుస్కియా జిల్లాలోని ఓ ఆయిల్ ఫీల్డ్‌లో మంగళవారం మంటలు (Assam Oil Field Fire) చెలరేగిన విషయం విదితమే. బాగ్జన్ ఆయిల్ ఫీల్డ్స్‌లో భాగమైన ఓ చమురు బావి మే 27న దెబ్బతింది. అప్పటి నుంచి సదరు ఆయిల్‌ఫీల్డ్ నుంచి గ్యాస్ (Assam Gas Leak) వెలువడుతూనే ఉంది. తాజాగా అక్కడ మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన ఫైర్‌ఫైటర్స్‌లో ముగ్గురు గల్లంతయ్యారు. కరోనాతో ఎన్‌సీపీ కార్పొరేటర్ మృతి, ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ముకుంద్ కేని
వీరిలో బుధవారం ఇద్దరు ఫైర్ ఫైటర్స్ మృత దేహాలను రికవర్ చేసుకున్నామని.. ఇంకొకరి ఆచూకీ తెలియరాలేదని అస్సాం చీఫ్ సెక్రటరీ కుమార్ సంజయ్ కృష్ణ తెలిపారు. మంటలను ఆర్పేందకు మరో నాలుగు వారాల సమయం పట్టొచ్చని ఆయిల్ ఇండియా లిమిటెడ్ అధికార ప్రతినిధి త్రిదిబ్ హజారికా తెలిపారు.
దాదాపు పది కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆ మంటలు కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం వద్ద సుమారు 1.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మంటల్ని ఆర్పేసినట్లు అగ్నిమాపక సిబ్బంది చెప్పింది. ఆయిల్ వెల్‌కు గ్యాస్ సరఫరా అవుతున్న నేపథ్యంలో అక్కడ ఇంకా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్ని ఆర్పేందుకు ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ సహకరిస్తున్నాయి. పారామిలిటరీ దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
Here's what CM Sonowal said:
#WATCH Fire continues to rage at the gas well of Oil India Ltd at Baghjan in Tinsukia district, 2 persons dead. #Assam pic.twitter.com/WgUhEqonGI
— ANI (@ANI) June 10, 2020
ఈ ఘటనపై అస్సాం సీఎం శర్వానంద సోనోవాల్ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ను ఆదేశించారు. మే 27న బావిలో బ్లోఔట్ అయింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇంజనీర్లు, ఎక్స్ పర్టులు గ్యాస్ లీక్ కాకుండా చర్యలు చేపట్టారు. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు సింగపూర్ నుంచి ముగ్గురు ఎక్స్ పర్టుల టీమ్ కూడా సోమవారం వచ్చింది. ఇప్పటివరకు 1,610 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు.
‘మంటలను ఆర్పేందుకు అగ్రిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అలర్ట్ టీమ్ సూచనల ప్రకారం ‘క్యాపింగ్ స్టాక్ గైడ్ రైల్’ పద్ధతిని ఓఎన్‌జీసీ, ఆయిల్ టీమ్స్ ఫాలో అయితున్నాయి’ అని త్రిదిప్ హజారికా చెప్పారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన 15 మంది అగ్ని మాపక సిబ్బందితోపాటు ఓఎన్‌జీసీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), డిస్ట్రిక్ట్ ఫైర్ సర్వీసెస్ మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఈ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో సుమారు 50 ఇళ్లు, చెట్లు దగ్ధమవ్వడంతోపాటు వెట్‌ల్యాండ్స్ దెబ్బతిన్నాయని సమాచారం. సమీప గ్రామాల నుంచి సుమారు 3 వేల మందిని సహాయ శిబిరాలకు తరలించారు.