మైనర్ ఇంటి పనిమనిషిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై అసోంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్‌పి)ని అరెస్టు చేసినట్లు డిజిపి జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఆదివారం తెలిపారు. గోలాఘాట్ జిల్లాలోని లచిత్ బోర్ఫుకాన్ పోలీస్ అకాడమీలో డీఎస్పీని నియమించారని, అతనిపై డెర్గావ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని సింగ్ చెప్పారు. ఇంట్లో పనిచేసే ఓ మైనర్‌ను పోలీస్ అధికారి లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆఫీసర్‌ను కిరణ్ నాథ్‌గా గుర్తించారు. ఎంపీలో దారుణం, పొలం నుంచి తిరిగి వస్తుండగా వివాహితపై గ్యాంగ్ రేప్, అనంతరం ఆమె చేత పురుగుమందు తాగించి పరారైన కామాంధులు
తనను ఆ ఆఫీసర్ ఇంట్లో బంధించి పదేపదే రేప్ చేసినట్లు బాధితురాలు చెప్పుకున్నది. కుటుంబసభ్యులతో కలిసి డీఎస్పీ తనను వేధించినట్లు ఆ యువతి పేర్కొన్నది. డేర్‌గావ్ పోలీసు స్టేషన్‌లో ఆ అమ్మాయి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఆదివారం కేసు నమోదు చేశారు. విచారణ ద్వారా ఆధారాలను సేకరించి డీఎస్పీ నాథ్‌ను అరెస్టు చేసినట్లు డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. ఐపీసీలోని 376, 506, పోక్సోలోని సెక్షన్ 6 కింద నాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.