బేతుల్, మార్చి 18: మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఓ వివాహితపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన అనంతరం క్రిమిసంహారక మందు తాగించిన ఘటన చోటు చేసుకుందని ఆదివారం నాడు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన శనివారం బోర్దేహి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఇద్దరు నిందితులలో ఒకరిని అరెస్టు చేసినట్లు సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (SDOP) షాలిని పరాస్తే తెలిపారు. బాధితురాలు (38) శనివారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి వస్తుండగా ఆమెకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై లిఫ్ట్ ఇస్తానని చెప్పారు. అయితే నిందితులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు తెలిపింది. భర్తను చితకబాది రైల్వే ఫ్లాట్ మీదనే గ్యాంగ్ రేప్, గుంటూరు జిల్లాలో వలస కూలీపై అఘాయిత్యానికి పాల్పడ్డ ముగ్గురు మృగాళ్లు, పోలీసుల అదుపులో నిందితులు, ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య బాధితులు
సంఘటన తరువాత, ఆమె చేత బలవంతంగా వారు పురుగుమందు తాగించారని తన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం ఆమె కుటుంబ సభ్యుల సహకరాంతో బెతుల్ జిల్లా ఆసుపత్రిలో చేరింది. పోలీసులు, తహసీల్దార్ ఆసుపత్రిలో బాధితురాలి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసి జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు" అని SDOP తెలియజేసింది. తదుపరి చర్య కోసం కేసును బోర్దేహి పోలీస్ స్టేషన్‌కు పంపుతామని ఆమె తెలిపారు.