New Delhi, SEP 18: ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియామకమయైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి (Atishi) ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) ప్రమాణస్వీకారంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమాచారం ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అతిషి కొత్తగా సీఎంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అయితే, ప్రమాణస్వీకారం తేదీని మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రకటించలేదు. మరో వైపు కొత్త ప్రభుత్వంలో ఎవరికి కేబినెట్‌లో చోటు దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతున్నది. కేబినెట్‌లో పాత మంత్రులతో పాటు మరో కొత్త ముఖాలకు సైతం ఛాన్స్ దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న పదవులపై ప్రాంతీయ, కుల సమీకరణాలు సమతూకంపై పార్టీ కసరత్తు చేస్తున్నది.
Here's Tweet
Delhi LG VK Saxena has moved the Resignation of Arvind Kejriwal as CM and claim letter of Atishi to form the Government to the President/MHA. LG has proposed 21st September as the date for swearing in of Atishi as CM: Sources
— ANI (@ANI) September 18, 2024
షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒకరికి మరొకరికి అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత మంత్రివర్గాన్ని మార్చేందుకు సీఎం సానుకూలంగా లేరని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత మంత్రులకు మంత్రివర్గంలో చోటు దక్కవచ్చని భావిస్తున్నారు. రెండుబెర్తుల కేబినెట్ బెర్తుల కోసం పలువురు ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. సోమనాథ్ భారతి, దుర్గేష్ పాఠక్, సంజీవ్ ఝా, దిలీప్ పాండే, మహేంద్ర గోయల్ జనరల్ కేటగిరిలో పోటీలో ఉన్నారు. ఎస్టీ కోటా నుంచి కులదీప్ కుమార్, విశేశ్ రవి, గిరీశ్ సోనీ బరిలో ఉన్నారు. గురువారం నాటికి మంత్రివర్గంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రపతి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో శుక్రవారం నాటికి కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సారి లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్‌లోనే ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేస్తుందని భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అతిషి నేతృత్వంలో ఢిల్లీ ప్రభుత్వ తొలి మంత్రివర్గంలో ఢిల్లీ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అక్టోబర్ తొలివారంలో ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది.
భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రముఖంగా మహిళా సమ్మాన్ యోజనపై చర్చించనున్నారు. పథకం కోసం ఢిల్లీ సర్కారు బడ్జెట్‌లో రూ.2వేలకోట్లు కేటాయించింది. ఈ పథకంలో ఢిల్లీలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 ఇవ్వాలని నిర్ణయించారు. ఉద్యోగం చేస్తున్నా.. ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్న వారికి పథకం వర్తించదు. అలాగే, ఢిల్లీ జల్‌బోర్డు బిల్లు మాపీ సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఆప్ పదేళ్ల పాలన తర్వాత సీఎంకు సైతం శాఖలు ఉండనున్నాయి. విద్య, పబ్లిక్ వర్క్స్‌తో పాటు పలు కీలకమైన శాఖలను తనవద్దే ఉంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇంతకు సీఎంగా ఉన్న కేజ్రీవాల్ తన వద్ద ఏ ఒక్కశాఖను ఉంచుకోలేదు. కొంతకాలం జలమండలి బాధ్యతలు చూసినా.. ఆ తర్వాత మరొకరికి అప్పగించారు.