Lucknow, December 19: అయోధ్యలో కొత్తగా నిర్మించే మసీదు నిర్మాణానికి సంబంధించిన భవన ఆకృతిని (Ayodhya Mosque Blueprint) అయోధ్య మసీదు ట్రస్టు శనివారం విడుదల చేసింది. గత యేడాది సుప్రీంకోర్టు అయోధ్యలో రామాలయం, మసీదులను (yodhya Mosque) విడివిడిగా నిర్మించుకోవచ్చని తీర్పునిచ్చింది.
ఈ నేపథ్యంలో మసీదు ప్రాజెక్టు తొలిదశలో భాగంగా వచ్చే యేడాది ప్రారంభంలో పునాది రాయి వేయవచ్చునని భావిస్తున్నారు. మసీదుతో పాటు ఆసుపత్రి నిర్మాణం (Super Speciality Hospital) కూడా చేపట్టి, రెండో దశలో ఆ ఆసుపత్రిని మరింత విస్తరించాలని ట్రస్టు భావిస్తోంది.
ఈ మసీదుకి ఇంకా పేరు నిర్ణయించలేదని, చక్రవర్తిగానీ, రాజు పేరుమీదగానీ మసీదు ఉండబోదని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) ట్రస్ట్ పేర్కొంది. ఈ ట్రస్ట్ ప్రపంచంలోని అనేక మసీదుల డిజైన్లను పరిగణనలోనికి తీసుకొని అయోధ్యలో మసీదు, దానిపక్కనే ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ని విడుదల చేసింది. రామ జన్మభూమిని వదులుకున్నందున సుప్రీంకోర్టు ఆదేశంతో యూపీ సర్కారు ఇచ్చిన ఐదెకరాల్లో దీని నిర్మాణాన్ని వచ్చే ఏడాది ప్రారంభిస్తారు.
Watch Video of Ayodhya Mosque Blueprint
The trust incharge of building a Mosque in Ayodhya ( on land allotted by UP govt post the SC’s 2019 Ram Temple verdict ) has revealed the first phase design - a mosque , and a super speciality hospital . Video below ... pic.twitter.com/xu6YCFaOZT
— Alok Pandey (@alok_pandey) December 19, 2020
అయోధ్య (Ayodhya) శివారులోని ధన్నీపూర్ గ్రామం లో ఈ మసీదు నిర్మాణం జరగనుంది. మసీదును గుడ్డు ఆకారంలో నిర్మిస్తారు. సౌర విద్యుత్తు ఏర్పాటు చేస్తారు. ఏకకాలంలో 2,000 మంది నమాజు చేయవచ్చు. మరోవైపు, 200 పడకల ఐదు అంతస్తుల దవాఖానా, సర్వమత భోజనశాల, అత్యాధునిక లైబ్రరీని కూడా నిర్మించనున్నారు.