New Delhi, August 31: కేంద్ర హోంశాఖ ఇటీవల అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో పలు కీలక రంగాలకు ఆంక్షల నుంచి సడలింపులు కల్పించింది. అయితే కోవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని (Ban on International Flights) సెప్టెంబర్ 30 వరకూ పొడిగించినట్టు పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) సోమవారం వెల్లడించింది. అయితే సంబంధిత అధికార యంత్రాంగం ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తామని డీజీసీఏ ఓ ప్రకటనలో పేర్కొంది.
కోవిడ్-19 వ్యాప్తిని (Coronavirus Pandemic) నిరోధించేందుకు మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ఆయా దేశాలతో పరస్పర ఒప్పందాలతో పాటు వందే భారత్ మిషన్ కింద కొద్ది నెలలుగా ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను ప్రభుత్వం నడుపుతోంది. ఇక కార్గో కార్యకలాపాలకు, డీజీసీఏ నిర్ధిష్టంగా అనుమతించిన విమానాలకు ఈ ఉత్తర్వులు వర్తించవని ప్రకటన పేర్కొంది. అన్‌లాక్–4 మార్గదర్శకాలను విడుదల చేసిన హోంశాఖ
అన్‌లాక్ 4.0లో (Unlock 4) భాగంగా దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. స్కూళ్లు, విద్యాసంస్ధల మూసివేతను సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. మరోవైపు సినిమా థియేటర్లు, బార్లు తెరవడానికి మరికొంత సమయం పట్టనుండగా, కంటైన్‌మెంట్ జోన్లలలో ఆంక్షలు యధావిధిగా కొనసాగనున్నాయి.
అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్
సెప్టెంబర్ 7 నుంచి మెట్రోరైళ్లకు అనుమతి
సెప్టెంబర్ 30 వరకు స్కూళ్లు, మాల్స్ బంద్
సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ బంద్
100 మందికి మించకుండా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, రాజకీయ సమావేశాలకు అనుమతి
సభలు నిర్వహించే సమయంలో భౌతికదూరం, మాస్క్, శానిటైజర్ తప్పనిసరి
సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి
అంతరాష్ట్ర ప్రయాణాలకు నిబంధనలను తొలగింపు
అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు
చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలన్న కేంద్రం
అత్యవసరమైతేనే బయటకు రావాలి
సెప్టెంబర్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగింపు