Bank Holidays Alert: నేటి నుంచి బ్యాంకులకు వరుసగా 4 రోజుల సెలవులు, ఏప్రిల్ నెలలో 9 రోజుల పాటు సెలవులను ప్రకటించిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెలవుల తేదీలను ఓ సారి చెక్ చేసుకోండి
Bank Holidays in April 2021 (Photo-ANI)

బ్యాంకులో పని ఉన్నవారు ఓ సారి అలర్ట్ అవ్వాలి. దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు ఏప్రిల్ నెలలో మొత్తం 9 రోజులపాటు సెలవులను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి విదితమే. అయితే రిజర్వు బ్యాంకు ఈ వారంలోనే వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ప్రకటించింది.

ఏప్రిల్ 13 నుంచి 16వతేదీ వరకు వరుసగా నాలుగురోజుల పాటు వివిధ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఇస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. కాగా దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా బ్యాంకులకు 4 రోజులపాటు వరుస సెలవులు ఇస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (Reserve Bank of India (RBI) తెలిపింది.

ఏప్రిల్ 13వతేదీన తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది, గుధి పడ్వా, నంగమాపంబ మొదటి నవరాత్రి, బైశాఖి సందర్భంగా బ్యాంకులకు సెలవు (banking holidays) ప్రకటించారు. హైదరాబాద్ నగరంతోపాటు బేలాపూర్, బెంగళూరు, చెన్నై, ఇంఫాల్, జమ్మూ, ముంబై, నాగపూర్, పనాజీ, శ్రీనగర్ ప్రాంతాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

ఏప్రిల్ నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు, హాలీడే క్యాలెండర్ ను విడుదల చేసిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, మొత్తం లిస్టు ఓ సారి చెక్ చేసుకోండి

ఏప్రిల్ 14వతేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, తమిళ కొత్త సంవత్సరం, విషు, బిజు ఫెస్టివల్, బోహాడ్ బిహు పండుగల సందర్భంగా అగర్తలా, అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చండీఘడ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్ టక్, గువహటి, హైదరాబాద్, ఇంఫాల్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, కోల్ కతా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, పనాజీ,పట్నా, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురంలలోని బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

ఏప్రిల్ 15వతేదీన హిమాచల్ దినోత్సవం, బెంగాల్ కొత్త సంవత్సరం, బోహాగ్ బిహు, సార్హుల్ పండుగల సందర్భంగా అగర్తలా, గువహటి, కోల్ కతా, రాంచీ, సిమ్లా ప్రాంతాల్లోని బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ సెలవు ప్రకటించింది.

ఏప్రిల్ 16వతేదీన బొహాగ్ బిహు పండగ సందర్భంగా గువహటిలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు .దీంతోపాటు ఏప్రిల్ 21, ఏప్రిల్ 24 తేదీల్లో రామనవమి, రెండో శనివారం సందర్భంగా రెండు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవని రిజర్వు బ్యాంకు వివరించింది.

సెలవుల వల్ల బ్యాంకులు పనిచేయకపోయినా ఆన్ లైన్ బ్యాంకింగ్ సర్వీసులు, ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్, ఆన్ లైన్ బ్యాంకింగ్ సర్వీసులు యథావిధిగా పనిచేస్తాయని రిజర్వు బ్యాంకు వెల్లడించింది. సెలవు రోజుల్లో మాత్రం బ్యాంకు బ్రాంచీలు పనిచేయవని ఆర్పీఐ వివరించింది.