Govt bank employees may go on 2-day strike from Jan 31 over wage revision (photo-PTI)

ఈ నెలలో బ్యాంకు ఖాతాదారులకు షాకింగే.. మీకు ఏదైనా ముఖ్యమైన బ్యాంకింగ్ పని ఉంటే, దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు మూసివేయబడే (Bank Holidays February 2022) ముఖ్యమైన రోజులను మీరు తప్పనిసరిగా గమనించాలి. బ్యాంకులకు 11రోజుల పాటు సెలవులు (ank branches to remain closed for 11 days) ఉన్నాయి. మొబైల్,ఇంటర్నెట్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు అంతరాయం లేకుండా కొనసాగుతున్నప్పటికీ, బ్యాంక్ సెలవులతో పాటు బ్యాంకింగ్ అసోసియేషన్ల సమ్మె కారణంగా అనేక బ్యాంకుల కార్యక‌లాపాలు మొత్తం 11రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు.

బ్యాంక్ యూనియన్లు ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 24న రెండు రోజుల సమ్మెకు (Bank Strike) పిలుపునిచ్చాయి. అయితే దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో బ్యాంక్ స్ట్రైక్‌ల‌తోపాటు ప‌బ్లిక్ హాలిడేస్‌ల కార‌ణంగా మొత్తం 11రోజులు బ్యాంకులు ప‌నిచేయ‌వ‌నే విష‌యాన్ని ఖాతాదారులు గుర్తించాల‌ని బ్యాంక్ సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే, అన్ని రాష్ట్రాలు లేదా ప్రాంతాలలో 11 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడవని మీరు గమనించాలి.

ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ అన్యాయం చేసింది, పార్లమెంటులో తలుపులు వేసి, మైక్‌లు కట్ చేసి, విభజన బిల్లును ఆమోదించింది, కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడిన ప్రధాని మోదీ

దేశంలోని వివిధ ప్రాంతాలలో రాష్ట్రాలు పాటించే సెలవులు మరియు బ్యాంకింగ్ సమ్మె కారణంగా బ్యాంకులు మూసివేయబడిన మొత్తం రోజుల సంఖ్య ఇది. ఉదాహరణకు చండీగఢ్, హిమాచల్, హర్యానా మరియు పంజాబ్‌లలో గురు రవిదాస్ జయంతి కోసం బ్యాంకులు మూసివేయబడతాయి కానీ తమిళనాడులో మాత్రం మూసివేయబడవు.

ఏఏ రోజుల్లో బ్యాంకులు ప‌నిచేయ‌వంటే?

ఫిబ్రవరి 12- నెలలో రెండవ శనివారం

13 ఫిబ్రవరి-ఆదివారం

15 ఫిబ్రవరి-హజ్రత్ అలీ జయంతి/లూయిస్-నగై-ని (ఉత్తరప్రదేశ్, మణిపూర్‌లలో బ్యాంకులు ప‌నిచేయ‌వు)

16 ఫిబ్రవరి-గురు రవిదాస్ జయంతి (చండీగఢ్, హిమాచల్, హర్యానా,పంజాబ్‌లలో బ్యాంకులు ప‌నిచేయ‌వు)

ఫిబ్రవరి 18-దోల్ యాత్ర (పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకులు ప‌నిచేయ‌వు)

ఫిబ్రవరి 19-ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (మహారాష్ట్రలో బ్యాంకులు ప‌నిచేయ‌వు)

ఫిబ్రవరి 20-ఆదివారం

ఫిబ్రవరి 23 - బ్యాంకు సమ్మె

ఫిబ్రవరి 24 - బ్యాంకు సమ్మె

26 ఫిబ్రవరి-నెలలో నాలుగవ శనివారం

ఫిబ్రవరి 27-ఆదివారం