
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (Buddhadeb Bhattacharya) కుమార్తె సుచేతన భట్టాచార్య (Suchetana Bhattacharya) పురుషుడిలా మారాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు లింగమార్పిడి చేయించుకోనున్నట్లు (sex reassignment surgery) ప్రకటించారు.
తాను పుట్టుకతో మహిళ అయినప్పటికీ చిన్నప్పటి నుంచీ పురుషుడిలాగానే జీవించినట్లు తెలిపారు. ఇప్పుడు శారీరకంగా పురుషుడిలా మారాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.తాను పురుషుడిగా మారిన తర్వాత తన పేరును సుచేతన భట్టాచార్య నుంచి సుచేతన్ గా మార్చుకోనున్నట్లు పేర్కొన్నారు.
నా ఈ నిర్ణయం వల్ల నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్య లేదు. దయచేసిన నా తల్లిదండ్రులను ఇందులోకి లాగొద్దు. మానసికంగా నన్ను నేను పురుషుడిగా భావిస్తున్నా. ఇప్పుడు భౌతికంగానూ పురుషుడిగా మార్పును కోరుకుంటున్నాను’అని వెల్లడించారు.