మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో సుమారు 20 మందిపై దాడి చేసి రూ.21,000 రివార్డ్‌ ఉన్న ‘మోస్ట్‌ వాంటెడ్‌’ కోతిని (Most Wanted Monkey) ఎట్టకేలకు నిర్బంధించారు. డ్రోన్‌ సహాయంతో దానిని గుర్తించిన సిబ్బంది మత్తు మందు ఇచ్చి పట్టుకుని బోనులో బంధించారు.ఈ కోతి గత 15 రోజుల్లో 20 మంది స్థానికులపై దాడి చేసింది. వీరిలో 8 మంది పిల్లలు కూడా ఉన్నారు.

కోతిని పట్టుకోవడంలో స్థానిక మున్సిపల్‌ సిబ్బంది, కోతులను పట్టుకునే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినా ఫలితం లేకపోవడంతొ ఈ కోతిని పట్టుకున్న వారికి రూ.21,000 బహుమతి ఇస్తామని మున్సిపల్ శాఖ ప్రకటించింది. ఎట్టకేలకు ఉజ్జెయిని అటవీ శాఖకు చెందిన రెస్క్యూ టీమ్ పట్టుకుంది. ఆ కోతిని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అటవీ శాఖకు చెందిన రెస్క్యూ సిబ్బంది తెలిపారు. కాగా, ‘మోస్ట్‌ వాంటెడ్‌’ కోతిని పట్టుకునేందుకు ప్రకటించిన రూ.21,000 రివార్డును ఆ టీమ్‌కు అందజేస్తామని రాజ్‌గఢ్‌ మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)