Bengaluru, June 19: బెంగళూరులో ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్లలో గల బార్లు, పబ్‌లపై శనివారం అర్ధరాత్రి నగర కేంద్ర విభాగ పోలీసులు దాడులు జరిపి అనైతిక కార్యకలాపాల్లో నిమగ్నమైన 26 మందికి పైగా ఆఫ్రికన్లను అరెస్ట్‌చేశారు.బెంగళూరులో ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్లలో గల బార్లు, పబ్‌లపై శనివారం అర్ధరాత్రి నగర కేంద్ర విభాగ పోలీసులు దాడులు జరిపి అనైతిక కార్యకలాపాల్లో నిమగ్నమైన 26 మందికి పైగా ఆఫ్రికన్లను అరెస్ట్‌చేశారు. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్, చర్చి వంటి హైవీధుల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
పరువు హత్య కలకలం, ప్రేమికులను చంపి మృతదేహాలను చంబల్ నదిలో మొసళ్లకు ఆహారంగా పడేసిన యువతి ఫ్యామిలీ
ఇక్కడ అర్థరాత్రి ఆఫ్రికన్ మహిళలు రోడ్ల మీద నిలబడి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న 60 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం, ప్రత్యేక దాడులు నిర్వహించింది. వీరిలో 26 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మినహాయిస్తే అందరూ ఆప్రికా మహిళలే. మహిళలు, పురుషులతో కలిపి 25 మందికి పైగా ఆఫ్రికన్లను డ్రగ్స్ పరీక్షలకు తరలించారు. వీరందరూ డ్రగ్స్ సేవించినట్లు వెల్లడైంది.
ఆఫ్రికన్లను కబ్బన్‌పార్కు పోలీస్‌స్టేషన్ కు తరలించి వారి పాస్‌పోర్ట్, వీసా తీసుకురావాలని సంబంధీకులకు పోలీసులు సూచించారు. కానీ ఎవరూ వాటిని తీసుకురాలేదు. అనేకమందిపై డ్రగ్స్ కేసుతో పాటు అక్రమ వలస కేసులు నమోదు చేశారు. వీరి వద్ద సోదాలు చేయగా డ్రగ్స్ దొరకలేదు. దీంతో ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చుకున్నారు అనేదానిపై విచారిస్తున్నారు.అందరిపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.