Bengaluru, August 14: బెంగళూరులో జరిగిన హింసాకాండ కేసులో (Bengaluru Violence) 60 మందిని అరెస్టు చేశామని బెంగళూరు జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ చెప్పారు. ప్రధాన నిందితుడైన బృహన్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (బీబీఎంపీ) ( Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) నాగ్వారా వార్డు కార్పొరేటర్ ఇర్షాద్ బేగం భర్త, కాంగ్రెస్ నాయకుడు (BBMP Corporator Irshad Begum's Husband) కలీంపాషాను కూడా పోలీసులు (Bengaluru City Police) అరెస్టు చేశారు. ఆయనతో పాటు 206 మందిని అదుపులోకి తీసుకున్నామని పాటిల్ పేర్కొన్నారు.
కలీంపాషా కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కేజే జార్జ్ కు సన్నిహితుడని పోలీసులు చెప్పారు. హింసాకాండ కేసులో నిందితుడైన కలీంపాషా మాజీ సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఉన్న చిత్రం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.ఈ నేపథ్యంలో బెంగళూరు హింసాకాండను మాజీ సీఎం సిద్ధరామయ్య ఖండించలేదని బీజేపీ నాయకుడు సంతోష్ ఆరోపించారు.
బెంగళూరు హింసలో సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) పాత్రను నిగ్గుతేల్చుతామని కర్ణాటక హోం మంత్రి బసవరాజు బొమ్మై అన్నారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపడతామని, ఎస్‌డీపీఐ కార్యకలాపాలపై నిఘా పెడతామని చెప్పారు. ఎస్‌డీపీఐ మీద నిషేధం విధించాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తున్నదని ఉప ముఖ్యమంత్రి అశ్వనాథ్ నారాయణ్ అన్నారు. హింసపై ఆధారాలు లభించాక నిషేధంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. బెంగళూరు హింసతో సంబంధం ఉన్న నలుగురు ఎస్‌డీపీఐకి చెందినవారిని పోలీసులు అరెస్టు చేశారు. గుడిని కాపాడేందుకు ముస్లీంలు మానవహారం, బెంగుళూరు అల్లర్లలో వెల్లివిరిసిన మతసామరస్యం, సోషల్ మీడియలో వైరల్ అవుతున్న వీడియో ఇదే
కర్ణాటక రాజధాని డీజే హళ్లి ప్రాంతంలో మంగళవారం రాత్రి చెలరేగిన హింసాత్మక ఘర్షణలకు సంబంధించి బెంగళూరు పోలీసులు ఇప్పటికే ఐదుగురి మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ అల్లర్లలో ముగ్గురు మరణించగా.. 200 కార్లు దగ్దమయ్యాయి. డీజే హళ్లి పోలీస్ స్టేషన్‌ను సైతం దుండగులు తగులబెట్టారు. ‘పోలీసులను చంపేయండి’ అంటూ ఆయుధాలు కలిగిన నిరసనకారులు నినాదాలు చేశారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఐదుగురు వ్యక్తులు మంగళవారం రాత్రి 8.45గంటలకు డీజే హళ్లి ప్రాంతంలో దాడులు ప్రారంభించారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసం బయట దాడులకు పాల్పడ్డారు. ఈ నిరసనలకు ప్రధాన కారణం ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి బంధువు ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరగడానికి ఆ పోస్ట్ కారణమని పోలీసులు చెబుతున్నారు. ఓ వర్గాన్ని కించపరిచేలా శ్రీనివాస్ మూర్తి బంధువు పోస్ట్ చేయడమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. ఫేస్‌బుక్ పోస్ట్‌తో బెంగుళూరులో అల్లర్లు, ఇద్దరు మృతి, 60 మంది పోలీసులకు గాయాలు, సీఎం యడ్యూరప్ప సీరియస్, ఘటనపై దర్యాప్తుకు ఆదేశించిన హోమంత్రి
తన ఇంటిపై దుండుగులు దాడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసమూర్తి స్పందిస్తూ.. తన ఇంటిపై దాడి జరగడానికి ఐదు నిమిషాల ముందే తన కుటుంబ సభ్యలందరూ కృష్ణాష్టమీ వేడుకలను సందర్శించడానికి దేవాలయానికి వెళ్లారని అన్నారు.అయితే తప్పు చేస్తే తన మేనల్లుడినైనా, ఎవరినైనా పోలీసులు శిక్షిస్తారని, కానీ తన ఇంటిని ధ్వంసం చేసే హక్కు ఎవరిచ్చారని విమర్శించారు.స్పష్టమైన ప్రణాళికతో దుండగులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తన నియోజక వర్గంలోని ప్రజలను సోదరుల్లాగా చూసుకుంటానని, ఎవరికైనా సమస్య ఉంటే తనను సంప్రదించవచ్చని అన్నారు. ఈ సంఘటనపై లోతైన విచారణ చేయాలని పోలీసులను శ్రీనివాస్ మూర్తి కోరారు.
కర్ణాటక రాజధాని బెంగుళూరులో చెలరేగిన హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి యడ్డ్యూరప్ప సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. శాంతియుత వాతావరణం కల్పించడానికి అక్కడికి చేరుకున్న పోలీసులపై కూడా దాడులు చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ప్రజలందరూ సంయనం పాటించాలని ఆయన కోరారు.