Bihar Boat Capsize (Image Credits: X/@09NDRF)

ముజఫర్‌పూర్‌, సెప్టెంబర్‌ 15: బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో పాఠశాల విద్యార్థులతో బాగమతి నదిలో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తాపడిన సంగతి విదితమే. పడవలో 34 మంది విద్యార్థులు ఉన్నారు.సహాయక బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి 20 మందిని రక్షించినట్లు చెప్పారు. మరో 12 మంది పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బాగ్‌మతి నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతైన 12 మంది విద్యార్థుల మృతదేహాలను శుక్రవారం నీటిలో నుంచి బయటకు తీశామని అధికారులు తెలిపారు.

మృతులను కామినీ కుమారి, సుస్మితా కుమారి, బేబీ కుమారి, సజ్దా బానో, గణిత దేవి, అజ్మత్, రితేష్ కుమార్, శివ్‌జీ చౌపాల్, సంషుల్, వసీమ్, మింటు మరియు పింటూ అని గైఘాట్ (ముజఫర్‌పూర్) సర్కిల్ ఆఫీసర్ రాఘవేంద్ర నాగ్వాల్ శుక్రవారం ANI కి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ మధ్య, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం బాధిత కుటుంబాలకు సహాయం చేయనున్నట్లు తెలిపారు.

ముజఫర్‌పూర్ జిల్లాలో ఘోర విషాదం, బాగమతి నదిలో 34 మంది విద్యార్థులో వెళుతున్న పడవ బోల్తా, 20 మందిని రక్షించిన పోలీసులు, మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం

ఈ ఘటనపై విచారించాలని ముజఫర్‌పూర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌కు చెప్పామని, ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని సీఎం గురువారం విలేకరులతో అన్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.