Patna, JAN 21: భార్య పుట్టింట్లో ఉండటంపై ఆగ్రహం చెందిన ఒక వ్యక్తి తన ప్రైవేట్ భాగాన్ని(chops off private part) నరుక్కున్నాడు. దీంతో ప్రభుత్వ వైద్య కాలేజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. బీహార్‌లోని (Bihar) మాధేపురాలో ఈ సంఘటన జరిగింది. గోల్‌పరా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలోధ్ (Krishna Basuki) ప్రాంతానికి చెందిన అనితతో 25 ఏళ్ల కృష్ణ బసుకి కొన్నేళ్ల కిందట పెళ్లైంది. ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడితో సహా నలుగురు సంతానం. కాగా, కృష్ణ పని కోసం పంజాబ్ వెళ్లి అక్కడ ఉంటున్నాడు. రెండు నెలల కిందట తన సొంత ప్రాంతమైన మాధేపురాలోని (Madhepura) రజనీ నయానగర్‌కు వచ్చాడు.
అయితే అతడి భార్య అనిత పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై ఆగ్రహించిన కృష్ణ శుక్రవారం రాత్రి పదునైన కత్తితో తన ప్రైవేట్ భాగాన్ని(chops off private part) నరుక్కున్నాడు. రక్తం మడుగుల్లో పడి ఉన్న అతడ్ని గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ వైద్య కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. అతడికి చికిత్స అందిస్తున్నామని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు కృష్ణ మానసికస్థితి సరిగా లేదని స్థానికులు వెల్లడించారు.