సోమవారంనాడు బీహార్‌ (Bihar)లో జరిగిన ఎన్నికల సభలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివరాల్లోకెళితే.. పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గంలోని పాలిగంజ్‌లో ఓ సభలో రాహుల్ గాంధీని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి వేదిక పైకి తీసుకువెళ్తుండగా వేదికలోని ఒక భాగం కిందకు కృంగిపోయింది. షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సజ్జనార్, అతివేగం.. మృత్యుపాశం అంటూ సూచన

దీంతో బ్యాలెన్స్ కోసం రాహుల్ కొద్దిసేపు తడబడ్డారు. వెంటనే ఆ విషయం గ్రహించిన మిసాభారతి ఆయన చేయి పట్టు నిలదొక్కుకునేందుకు సహకరించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బందిని రాహుల్ ఫరవాలేదంటూ వారించడం, ఆ వెంటనే రాహుల్ నవ్వుతూ వేదికపై నుంచి సభికులకు చేయి ఊపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పాటలీపుత్ర లోక్‌సభ సీటు నుంచి మిసా భారతి పోటీ చేస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)