
Bihar, July 14: కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ మరోమారు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌కు (Another Lockdown in Bihar) సిద్ధమవుతోంది.. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం (Bihar government) మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించబోతోంది. సమావేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల కట్టడి గురించి సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ మాట్లాడుతూ.. 'సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన ప్రభుత్వం నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. దేశంలో 24 గంటల్లో 28,498 కొత్త కేసులు, 540 మరణాలు, 9,07,645కు చేరుకున్న కోవిడ్-19 కేసులు, కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,71,460 మంది
ఈ సమావేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల కట్టడి గురించి సమీక్షించనున్నారు. పెరుగతున్నకోవిడ్-19 కేసుల దృష్ట్యా రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే ఆలోచన ఉందని తెలిపారు. అయితే ఇప్పటికే బెంగళూరు, పూణే నగరాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించగా.. యూపీలో వారాంతాల్లో లాక్‌డౌన్‌ను (coronavirus lockdown) అమలు చేస్తున్న విషయం తెల్సిందే. కాగా రాష్ట్రంలో కొత్తగా 1,116 కరోనా కేసులు నమోదుకావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య (coronavirus cases) 17,959కు చేరుకున్నాయి.
అదే విధంగా ఒక వైద్యుడు కూడా కరోనా కారణంగా మృతిచెందారు. 54 ఏళ్ల డాక్టర్ అశ్వని నందకులియార్ పట్నాలోని ఎయిమ్స్‌లో కన్నుమూశారు. అలాగే మరో 9 మంది కరోనా బాధితులు కూడా మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 160 కు చేరుకుంది.
పాట్నా బీజేపీ ఆఫీసుకు కరోనా సెగ తాకింది. బీజేపీ ఆఫీసులో (Coronavirus Cases in Patna BJP Office) 24 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 110 శాంపిల్స్ నిర్వహించగా వారిలో 24 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు బీహార్ బీజేపీ ప్రెసిడెంట్ సంజయ్ జైస్వాల్ తెలిపారు. దీంతో పాటుగా బీహార్ లోని బిహ్త ఏరియాలో అంత్యక్రియలకు హాజరైన వారికి 20 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో ఆ ఏరియాలో కఠినమైన ఆంక్షలు విధించారు. ఏరియా మొత్తాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. కాగా జూలై 10న మరణించిన వ్యాపార వేత్త రాజ్ కుమార్ అంత్యక్రియలకు వీరంతా హాజరయ్యారు.