New Delhi, July 14: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) మంగళవారం నాటికి 9 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 28,498 కొత్త కేసులు వెలుగు చూశాయి. దేశంలో 28 వేల కేసులు నమోదవ్వడం ఇది వరుసగా మూడో రోజు. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య ( Coronavirus Cases in India) 9,06,752కు చేరింది. ఒక్క రోజులో 540 మంది వైరస్‌తో పోరాడి మృత్యువాత పడ్డారు.మానవత్వం ఈ డాక్టర్ రూపంలో బతికే ఉంది, కోవిడ్-19 మృతదేహాన్ని ట్రాక్టర్‌లో వేసుకుని స్మశానానికి తీసుకువెళ్లిన పెద్దపల్లి డాక్టర్, వైరల్ అవుతున్న వీడియో
మొత్తం మరణాల సంఖ్య (COVID Deaths in India) 23,727కు చేరింది. ప్రస్తుతం 3,11,565 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 5,71,460 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో నిన్న(సోమవారం) 6,497 కేసులు నమోదవ్వగా మొత్తం కేసులు 2,60,924 నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో కొత్తగా 1,246 మంది కరోనా బారిన పడగా మొత్తం 1,42,000 నమోదయ్యాయి.
కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. 3,363,056 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 1,884,967 కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం నాటికి 13 మిలియన్ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5,72000 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా విషయంలో ప్రపంచ దేశాలు కఠిన నియమాలు పాటించకపోతే మహమ్మారి పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
కాగా భారత్‌లో కరోనా రికవరీ రేటు 63.02శాతానికి పెరిగింది.19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది జాతీయ సగటు కంటే అధికంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. కరోనా మరణాల శాతం 2.64 కాగా, 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువగానే ఉందని పేర్కొంది. తెలంగాణలో రికవరీ రేటు 64.84 శాతమని వెల్లడించింది.
కోవిడ్ చికిత్సలో వాడే యాంటీ వైరల్ డ్రగ్ ‘ఫవిపిరవిర్’ మాత్రల ధరను 27 శాతం తగ్గించినట్లు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. ఒక్కో మాత్ర ఖరీదు రూ.103 కాగా, ఇకపై రూ.75కు అమ్ముతారు. మాత్రలు ఫాబీఫ్లూ అనే బ్రాండ్ నేమ్‌తో లభ్యమవుతున్నాయి. వీటిని గత నెలలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫవిపిరవిర్‌ను ఇప్పుడు భారత్‌లోనే తయారు చేస్తున్నామని, అందుకే ఖర్చు తగ్గిందని, ఆ ప్రయోజనాన్ని కరోనా బాధితులకు బదిలీ చేస్తున్నామని గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ వెల్లడించింది.