Image used for representational purpose only (Photo Credits: Wikimedia Commons)

Gandhi Nagar, Nov 15: పదేళ్ల బాలుడిని కోతులు అతి కిరాతకంగా హతమార్చాయి. కడుపులో పేగులను చీల్చి చంపేసాయి . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని సాల్కి గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. దేహగాం తాలూకాలోని ఓ దేవాలయం సమీపంలో కోతుల దాడి జరిగినట్లు అటవీ అధికారులు తెలిపారు. బాధితుడిని దీపక్ ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. బాలుడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ వైద్యులు అతనికి సహాయం చేయడం ప్రారంభించేలోపే అతను తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.

జమ్మూ కాశ్మీర్ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన, గాయపడిన వాళ్లకు రూ.50 వేల పరిహారం

దీపక్.. గ్రామంలో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో, ఈ కోతుల గుంపు భయభ్రాంతులకు గురి చేసాయని పోలీసులు, అటవీ అధికారులు తెలిపారు.కోతులు బాలుడిపైకి దూకి,అతని చర్మాన్ని పూర్తిగా గోళ్లతో రక్కివేసాయి. పొట్ట మీద దాడి చేయడంతో లోపల పేగులు బయటకు వచ్చాయి. ఇది గమనించిన బాలుడి తల్లిదండ్రులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు.

ఘోర రోడ్డు ప్రమాదం, జమ్మూ కశ్మీర్‌లో లోయలో పడిన బస్సు, 32 మంది అక్కడికక్కడే దుర్మరణం, 22 మందికి తీవ్ర గాయాలు

వారం రోజుల్లో గ్రామంలో కోతుల దాడి ఇది మూడవది. అటవీశాఖ అధికారి విశాల్ చౌదరి మాట్లాడుతూ గ్రామంలో కోతులను పట్టుకునేందుకు డిపార్ట్‌మెంట్ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మేము గత వారంలో రెండు లంగూర్‌లను పట్టుకున్నాం. మరొక లంగూర్‌ను ట్రాప్ చేయడానికి బోనులను ఏర్పాటు చేసాము. గ్రామంలో పెద్ద కోతుల దళం ఉంది, ఇందులో గత వారంలో దాడులకు పాల్పడిన నాలుగు పెద్ద కోతులు ఉన్నాయి. వాటిలో రెండింటిని బందీగా పట్టుకున్నాం. మరొక దానిని బంధించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి" అని విశాల్ చౌదరి తెలిపారు.