Nirmala Sitharaman (Photo-ANI)

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‍ కేంద్ర బడ్జెట్‍ 2023-24 ను ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్‌ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్‌ ప్రసంగాన్ని వినిపించారు. పర్యావరణ హిత చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పెద్దపీట వేస్తున్నట్టు నిర్మల తెలిపారు.

ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. అదే సమయంలో టీవీ ప్యానెళ్లపైనా ఉదారంగా వ్యవహరించారు. మొత్తమ్మీద పలు వస్తువులపై కస్టమ్స్ సుంకం తగ్గించారు. అటు, బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం పెంచారు.

ఇకపై సిగిరెట్లు చాలా కాస్ట్ గురూ, కొన్ని సిగరెట్లపై ఎన్‌సిసిడిని 16% పెంచుతున్నట్లు తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

బంగారు కడ్డీలతో తయారు చేసిన వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పెంచారు.కిచెన్ ఎలక్ట్రిక్ చిమ్నీపై కస్టమ్ డ్యూటీ 7.5% నుండి 15%కి పెరిగింది. ప్రయోగశాలలో పెరిగిన వజ్రాల తయారీలో ఉపయోగించే విత్తనాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రొయ్యల మేతపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది.రాగి స్క్రాప్‌పై 2.5 శాతం రాయితీ ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం కొనసాగించనుంది. నివాస గృహాలలో పెట్టుబడులపై మూలధన లాభాల నుండి తగ్గింపులను ₹10 కోట్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

వేతన జీవులకు ఊరటనిచ్చిన కేంద్రం, రూ. 7లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్‌ లేదని ప్రకటన, పన్ను మినహాయింపు రూ.5లక్షల నుంచి 7లక్షలకు పెంపు

సిగరెట్‌లపై కస్టమ్‌ డ్యూటీ పెంచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. టెక్స్‌టైల్స్ మరియు వ్యవసాయం కాకుండా ఇతర వస్తువులపై ప్రాథమిక కస్టమ్ డ్యూటీ రేట్ల సంఖ్యను 21 నుండి 13కి తగ్గించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. ఫలితంగా, కొన్ని ప్రాథమిక కస్టమ్ సుంకాలు, సెస్‌లు మరియు సర్‌ఛార్జ్‌లలో స్వల్ప మార్పులు ఉన్నాయి.

ధరలు తగ్గేవి

ఎలక్ట్రిక్ వాహనాలు

టీవీలు, మొబైల్ ఫోన్లు

కిచెన్ చిమ్నీలు

లిథియం అయాన్ బ్యాటరీలు

ధరలు పెరిగేవి

టైర్లు

సిగరెట్లు

బంగారం, వెండి

వజ్రాలు

బ్రాండెడ్ దుస్తులు

విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు